మన టాలీవుడ్ హీరోలు నాలుగు రకాలుగా రెండు చేతులా సంపాదించేస్తున్నారు. కేవలం నటనను నమ్ముకోవడంలోనో లేదా నిర్మాతగానో ఉండకుండా మరికొన్ని బిజినెస్‌లు చేస్తుండడంతో వీరి పని మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతోంది. మన హీరోల్లో ఎక్కువ బిజినెస్‌లు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు కింగ్ నాగార్జు. 20 సంవత్సరాల నుంచి నాగార్జున అనేక వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతూ వచ్చాడు. రియల్ ఎస్టేట్, రెస్టారెంట్ల నిర్వహణలో నాగార్జున ఆరితేరిపోయాడట.
ఇక ఎన్ గ్రిల్ రెస్టారెంట్లతో నాగార్జున బిజినెస్ చేస్తున్నాడు. ఇక చందమామ సినిమాతో పాపులర్ అయిన యంగ్‌హీరో హైదరాబాద్ పబ్‌ల బిజినెస్‌లోకి వచ్చాడు. మనోడికి గచ్చిబౌలిలో బీపీఎంఅనే పబ్ ఉంది. మరో యంగ్ హీరో తరుణ్‌కు జూబ్లిహిల్స్ సమీపంలోనే మంచి రెస్టారెంట్ ఉంది. స్టైలీష్ అల్లు అర్జున్‌కు కూడా హైదరాబాద్‌లో ఓ కాస్ట్‌లీ పబ్ ఉంది. వీకెండ్స్‌లో ఇక్కడ ఎంజాయ్ చేసే వారి సంఖ్య చాలా ఎక్కువ.
ఇక శర్వానంద్‌కు సైతం బెంజ్ కాపీ షాపు ఉంది. ఇక రామ్‌చరణ్ సైతం రేసులు, ఎయిర్ జెట్ బిజినెస్‌లు, రియల్ ఎస్టేట్ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టాడు. ఇక అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్ సోదరులు కూడా సైడ్ బిజినెస్‌లతో బాగానే ఆదాయం సమకూర్చుకుంటున్నారు. వీరితో పాటు పలువురు హీరోయిన్లు సైతం సైడ్ బిజినెస్‌లతో గట్టిగానే కడబెట్టుకుంటున్నారు.