యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా … నందమూరి హీరో కళ్యాణ్‌రామ్ నిర్మాతగా ఓ బంపర్ ప్రాజెక్టు తెరకెక్కనుందా ? అంటే అవుననే చర్చలు టాలీవుడ్లో వినిపిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా బాబాయ్ బాలయ్యతో తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో సినిమా తీయాలని కళ్యాణ్‌రామ్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎన్టీఆర్‌తో జై లవకుశ సినిమా తీసి హిగట్ కొట్టిన కళ్యాణ్‌రామ్ అప్పటి నుంచే బాబాయ్ ప్రాజెక్టు కోసం చేయని ప్రయత్నం లేదు.
అయితే బాలయ్య ఎప్పుడూ ఓకే చెప్పకపోవడంతో పాటు అటు రాజకీయాలు, ఇటు సినిమాల్లో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ బయోపిక్‌లు, రూలర్‌తో గతేడాది ఫుల్ బిజీ, ఆ వెంటనే బోయపాటితో బీబీ 3కు ఫిక్సయ్యాడు. ఎట్టకేలకు బాలయ్య కోసమే ఎన్టీఆర్ పీఆర్వోల ఆధ్వర్యంలో ఓ పవర్ ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కథను కళ్యాణ్‌రామ్ రెడీ చేయించారట. ఈ కథను త్వరలోనే బాలయ్యకు వినిపించడంతో పాటు సినిమాను ఓకే చేయించుకోవాలని కళ్యాణ్‌రామ్ ప్లాన్.
ప్రస్తుతం ఎన్టీఆర్ 30వ ప్రాజెక్టులో చినబాబుతో కలిసి కళ్యాణ్‌రామ్ భాగస్వామిగా ఉన్నాడు. ఇక ఇప్పుడు బాలయ్యతో భారీ బడ్జెట్‌తో మాస కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ను తెరకెక్కించే పట్టుదలతో ఉన్నాడు. ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయితే నందమూరి అభిమానులకు అంతకు మించిన పెద్ద పండగ ఉండదు. అనిల్ రావిపూడి పేరు ఈ సినిమాకు దర్శకుడిగా అంతర్గత చర్చల్లో వినిపిస్తోందట. మరి బాలయ్య ఎవరికి ఓటేస్తాడో ? చూడాలి.