దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాను తిరిగి ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేసి ఎప్పుడు ఫినిష్ చేసి ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియడం లేదు. వాస్తవానికి వచ్చే సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తామని చెప్పినా ఇప్పుడు కరోనా నేపథ్యంలో షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో కూడా తెలియడం లేదు. ఈ బ్యాలెన్స్ పార్ట్ కంప్లీట్ అయ్యి నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసి ఆర్ ఆర్ ఆర్ థియేటర్లలోకి వచ్చేది 2022నే అంటున్నారు.
ఇటు రామ్‌చరణ్ కొరటాల దర్శకత్వంలో తన తండ్రి నటిస్తోన్న ఆచార్య సినిమా చేస్తున్నారు. ఇందులో చరణ్ కూడా చిన్న రోల్ చేస్తున్నాడు. ఆచార్యను 2021 సమ్మర్‌కు రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. చరణ్ రోల్ ఫినిష్ చేస్తేనే ఆచార్య వచ్చే సమ్మర్‌కు వస్తుంది. చరణ్ ఆచార్యలో నటిస్తే ఆర్ ఆర్ ఆర్‌లో అల్లూరి సీతారామరాజు రోల్ కోసం కష్టపడిన లుక్ అంతా పాడవుతుంది. అలాగని చరణ్ ఆచార్య షూటింగ్లో పాల్గొనకపోతే కుదరని పరిస్థితి.
ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ స్టార్ట్ అయ్యి అందులో దిగితే వెనక్కు రాలేని పరిస్థితి.. అందుకే చరణ్ ముందుగా ఆచార్యలో తన రోల్ ఫినిష్ చేసేయాలనుకుంటున్ననాడట. రాజమౌళి మాత్రం అల్లూరి సీతారామరాజు లుక్ ఎక్కడ రివీల్ అవుతుందో ? అన్న టెన్షన్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే బాహుబలి సినిమాలో ప్రభాస్ లుక్ ఎక్కడా రివీల్ కాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడో తెలిసిందే. ఏదేమైనా చరణ్ ఆచార్యలో తన రోల్ ఫినిష్ చేయాలనుకోవడం ఇప్పుడు రాజమౌళిని పెద్ద టెన్షన్లోనే పడేసినట్లయ్యింది.