ప్రముఖ లెజెండ్రీ గాయకుడు ఎస్పీ. బాలసుబ్రహ్మణ్యం గత కొంత కాలంగా కోవిడ్‌తో బాధపడుతూ చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న సంగతి తెలిసిందే. బాలుకు కరోనా సోకిన టైంలో ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నా తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా విషమించింది. ఆరోగ్యంలో హెచ్చుతగ్గులు రావడంతో పాటు చెన్నై ఎంజీఎం వైద్యులు సైతం ఒకానొక దశలో చేతులు ఎత్తేసే పరిస్థితి రావడంతో అందరూ ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
చివరకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు సైతం బాలు కోలుకోవాలని ఆకాంక్షించారు. కొన్ని చోట్ల ప్రార్థనలు, పూజలు కూడా జరిగాయి. ఎట్టకేలకు బాలు రికవరీ అయ్యారు. తాజా అప్డేట్ ప్రకారం బాలు ఆరోగ్యం కుదుట పడిందని ఆయన తనయుడు చరణ్ చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. బాలు చికిత్స చేసేందుకు వైద్యులకు రెస్పాండ్ కూడా అవుతున్నారని ఆయన తెలిపారు.
ఇక తాజా బులిటెన్ ప్రకారం బాలు 90 శాతం రికవరీ అయినట్టే తెలుస్తోంది. మరో వారం రోజుల్లో ఆయన పూర్తిగా కోలుకుంటారని.. ఆ తర్వాత ఆయన్ను మరి కొద్ది రోజులు అబ్జర్వేషన్లో ఉంచి డిశ్చార్జ్ చేస్తారని సమాచారం.