దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఈ కేసు విచారణలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఈ క్రమంలోనే మరో సంచలన వార్త బయటకు వచ్చింది. సుశాంత్ మాజీ మేనేజర్ దిశ దిశా సాలియన్ సుశాంత్ కంటే ముందు ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఓ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
ఒక భవనంపై నుంచి దూకి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. అక్కడి నుంచి కూడా ఆమె మరణం సందేహంగానే ఉంది. అయితే దిశ మృతి చెందిన తర్వాత కూడా ఆమె ఫోన్ 9 రోజుల పాటు పనిచేసింది. ఆమె ఫోన్ వాడుకలోనే ఉంది. ఈ ఫోన్ నుంచి ఇంటర్నెట్ కాల్స్ వెళ్లాయి. అయితే ఈ ఫోన్ ఎవరు వాడారు ? అన్నదే ఇప్పుడు పెద్ద సస్పెన్స్‌గా మారింది. ఇక ఫోరెన్సిక్ విచారణకు కూడా ఫోన్ ఇవ్వలేదు అని గుర్తించారు.
దిశ ఆత్మహత్య తర్వాత ఈ ఫోన్ సుశాంత్ వాడాడా ? లేదా ? రియా వాడిందా ? అన్న సందేహాలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఇక సీనియర్ దర్శకుడు రియాకు మహేష్ భట్ సహకరించారు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ కేసులో రియాను ఎప్పుడు అయినా అరెస్టు చేయవచ్చని అంటున్నారు.