బాలీవుడ్ హీరోయిన్లకు క్రికెటర్లకు మధ్య ప్రేమాయణాలు ఈ నాటివి కావు.. అప్పుడెప్పుడో విండీస్ క్రికెటర్ వివ్ రిచర్డ్స్‌తోనే నీనా గుప్తా ప్రేమాయణం నడిపి ఓ బిడ్డకు తల్లి కూడా అయ్యింది. అజారుద్దీన్ – సంగీత బిజ్లానీ నుంచి నేటి విరుష్కల వరకు ఈ లిస్ట్ చాలానే ఉంది. ఇక హార్దిక్ పాండ్యా సైతం కోహ్లీ రూట్లోనే వెళ్లాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ హీరో కూతురుతో క్రికెటర్ ప్రేమాయణం నడుపుతోన్న సంఘటన హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే యంగ్ క్రికెటర్ కేఎల్. రాహుల్ సైతం వరుస పెట్టి హీరోయిన్లతోనే ప్రేమాయణం నడుపుతున్నాడు.
గతంలో హీరోయిన్ నిధి అగర్వాల్‌తో కొద్ది రోజుల పాటు ప్రేమాయణం నడిపిన రాహుల్ ఇప్పుడు మరో అమ్మాయిని పట్టేశాడంటున్నారు. సీనియర్ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అథియా శెట్టితో రాహుల్ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నాడన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా రాహుల్ ఓ లవ్ సింబల్ ఎమోజీని పోస్టు చేసి తమ మధ్య ఉన్న బంధం బయట పెట్టాడని గుసగుసలాడుకుంటున్నారు.
గతంలోనే నిధి అగర్వాల్‌తో పాటు మరో హీరోయిన్‌తో సైతం తిరిగిన రాహుల్ ఇప్పుడు అథియా శెట్టిని అయినా పెళ్లి చేసుకుంటాడా ? లేదా కొద్ది కాలానికి మళ్లీ ఆమెకు కూడా షాక్ ఇస్తాడా ? అన్నది చూడాలి.