సెన్సిబుల్ డైరెక్టర్ క్రిష్ మణికర్ణిక, రెండు ఎన్టీఆర్ బయోపిక్‌ల తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ఇక క్రిష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా కోసం కసరత్తులు చేస్తోన్న సంగతి తెలిసిందే. పవన్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న వకీల్‌సాబ్ సినిమాలో నటిస్తున్నాడు. కరోనా నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. పవన్ వచ్చే యేడాది కూడా వకీల్‌సాబ్‌కు డేట్లు ఇవ్వనున్నాడట. ఆ తర్వాతే క్రిష్ – పవన్ సినిమా స్టార్ట్ కానుంది.
దాదాపు పవన్ మరో ఏడెనిమిది నెలలకు పైగా క్రిష్‌కు అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. అందుకే ఈ లోగా క్రిష్ వైష్ణవ్ తేజ్‌తో మరో సినిమా ప్లాన్ చేసుకుంటోన్న సంగతి తెలిసిందే. ఇక పవన్ – క్రిష్ మూవీ గురించి రెండు ఫ్యీజులు ఎగిరిపోయే అప్డేట్స్ వచ్చేశాయి. ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్గా నటిస్తోంది. జాక్వెలిన్ – పవన్ కాంబినేషన్ అంటే ఎంత వీనులవిందుగా ఉంటుందో తెలిసిందే.
ఇక ఈ సినిమాలో పవన్ రాబిన్ హుడ్ తరహా రోల్లో కనిపించనున్నాడట. విరూపాక్ష టైటిల్‌ను ఈ సినిమాకు పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇక పవన్ – జాక్వెలిన్ మధ్య వచ్చే ఘాటు ప్రేమ సన్నివేశాలను క్రిష్ ఓ రేంజ్లో రాసుకున్నాడట. ఇవి విన్న పవన్ సైతం మెస్మరైజ్ అయ్యాడంటున్నారు. భారీ సెట్లలో భారీ స్థాయిలో ఈ సినిమాని క్రిష్ చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు.