బాలీవుడ్లో నిన్నటి తరం హీరోయిన్ పూజా బేడీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులో కూడా ఎన్నో సినిమాల్లో నటించిన ఆమె 16 ఏళ్ల క్రితమే తన భర్త ఫర్హాన్ ఫర్నిచర్ వాలా నుండి విడిపోయింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఆలియా, ఒమర్ ఉన్నారు. ప్రస్తుతం పిల్లలతో కలిసి ఉంటోన్న ఆమె రెండో పెళ్లికి రెడీ అవుతోంది. ఆమె నుంచి విడాకులు తీసుకున్న మాజీ భర్త ఫర్హాన్ లైలా ఖాన్ ను పెళ్లి చేసుకున్నాడు. ఇక ఇప్పుడు పూజా పిల్లలు తమ తల్లికి కూడా ఓ తోడు ఉంటే బాగుంటుందని ఆశ పడుతున్నారట.
ఇక ఏదైనా ఓపెన్‌గా చెప్పే పూజ తాను మనేక్ కాంట్రాక్టర్ తో పూజా ప్రేమలో ఉన్నానని.. తామిద్దరం సహజీవనం కూడా చేస్తున్నామని చెప్పింది. తనతో పాటు తన ఇద్దరు పిల్లలకు కూడా మనేక్ అంటే చాలా ఇష్టం అని చెపుతోంది. నాన్న ఇప్పటికే పెళ్లి చేసుకుని తండ్రి అయ్యారు.. నువ్వు మళ్లీ ఎందుకు పెళ్లి చేసుకోకూడదని వారు తనను పదే పదే ప్రశ్నిస్తున్నారని కూడా పూజా చెప్పింది.
ఇక ఓ టాక్ షోలో ఆమె మాట్లాడుతూ తనతో పాటు తన పిల్లలకు మనేక్ మంచి తండ్రిగా ఉంటాడని.. తనకు అనిపిస్తోందని చెప్పింది. ఈమె చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఈమె మనేక్‌తో రెండో పెళ్లికి రెడీ అవుతోన్న విషయంలో దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే అయిదు పదుల వయసు ఉన్న పూజా బేడీ పెళ్లి ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.