జాతీయ స్థాయిలో ఏ విషయంలో అయినా ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టే ఫైర్ బ్రాండ్ హీరోయిన్ కంగనా రనౌత్. తాజాగా ఆమె రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి వస్తానని.. అందుకే మోదీకి మద్దతు ఇస్తున్నానంటూ జరుగుతోన్న ప్రచారంపై స్పందించిన ఆమె మాట్లాడుతూ గత ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాయని తెలిపారు. గ్యాంగ్‌స్టర్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచే తనకు పలు పార్టీలు సీటు ఇచ్చేందుకు ప్రయత్నించాయన్నారు.
తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని.. మా తాత వరుసగా 15 సంవత్సరాలు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. నా కుటుంబం రాజకీయాల్లో బాగా ప్రాచుర్యం పొందింది.. తనకు గతంలో కాంగ్రెస్ నుంచే రెండు మూడు సార్లు ఎమ్మెల్యే టిక్కెట్ ఆఫర్ వచ్చిందని కూడా ఆమె ట్వీట్ చేశారు. ఇక కాంగ్రెస్ నుంచే కాక మణికర్ణిక సినిమా తర్వాత బీజేపీ నుంచి కూడా నాకు ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ వచ్చిందని.. ఒక ఆర్టిస్ట్‌గా నా పని అంటే నాకు ఎంతో ప్రేమ. రాజకీయాల గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదని.. ఇక ఎవరికి మద్దతు ఇవ్వాలనేది తన వ్యక్తిగత అంశమని కంగనా చెప్పారు.