పాకిస్తాన్ క్రికెటర్ పదేళ్ల తర్వాత టెస్టు క్రికెట్లోరి రీ ఎంట్రీ ప్రపంచమే షాక్ అయ్యేలా చేశారు. పాక్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ ఫావద్ అలామ్ పదేళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. 2009లో చివవరి సారిగా టెస్ట్ క్రికెట్ ఆడిన ఫవాద్ కు ఇప్పుడు మూడు టెస్టుల సీరిస్‌లో భాగంగా పాక్ మేనేజ్‌మెంట్ మళ్లీ ఫవాద్‌కు అవకాశం కల్పించింది. ఇలా పదేళ్ల తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడిన రెండో క్రికెటర్‌గా ఫవాద్ ప్రపంచ రికార్డు క్రియేట్ చేశాడు. ఫవాద్ ఆడిన ఈ రెండు టెస్ట్ మ్యాచ్‌ల మధ్య గ్యాప్ 3,911 రోజులు.
ఫావద్ చివరి టెస్టు ఆడిన సమయానికి విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్‌లు ఇంకా లాంగెస్ట్ ఫార్మాట్‌లో అరంగేట్రం చేయలేదు. ఫవాద్ టెస్టుల్లో 41.66 సగటుతో 250 పరుగులు సాధించాడు. 2009లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అదే ఏడాది న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడిన తర్వాత పాక్ జెర్సీలో కనిపించలేదు. ఇక గతంలో యూసఫ్ అహ్మద్ 104 టెస్టులను మిస్ అయిన తర్వాత మళ్లీ ఆడాడు.