According to the survey, NTR stood hero of 2016 on the basis of hits, performance and following. He got Nannaku Prematho, Janatha Garage hits in this year.
ప్రతి ఏడాది చివరన టాప్ హీరో ఎవరనే లెక్కలు వేస్తుంటారు. వారు సాధించిన విజయాలు, ప్రజాదరణ, పెర్ఫార్మెన్స్‌కి పడ్డ మార్కులు, తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆ సర్వే నిర్వహించడం జరుగుతుంది. అలాంటిదే 2016లో నిర్వహిస్తే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాప్ హీరోగా స్థానం దక్కించుకున్నాడు.
ఏడాది ప్రారంభంలో సంక్రాంతి కానుకగా ‘నాన్నకు ప్రేమతో’ సినిమాతో తారక్ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తొలిసారి తన ఇమేజ్‌కి పూర్తిగా భిన్నంగా క్లాస్‌గా నటించి.. నటుడిగా మరో మెట్టు ఎదిగాడు. దాంతో.. అతనికి మాస్‌తోపాటు క్లాస్ ఆడియెన్స్ నుంచి ప్రశంసలు అందాయి. అంతేకాదు.. ఆ సినిమాతోనే మొదటిసారి రూ.50 కోట్ల క్లబ్‌లో చేరాడు. ఇక దీని తర్వాత చేసిన ‘జనతా గ్యారేజ్’ మూవీతో ఇండస్ట్రీ హిట్ సాధించాడు. రూ.82 కోట్లకుపైగా షేర్, రూ.135 కోట్లకు గ్రాస్ వసూళ్లతో.. టాలీవుడ్ ఆల్‌టైమ్ రికార్డ్ సినిమాల జాబితాలో మూడో స్థానం దక్కించుకున్నాడు. అలాగే.. ఈ మూవీతో అనూహ్యమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా.. సోషల్ మీడియాలో ఏ స్టార్ హీరోకి సాధ్యంకాని రీతిలో తిరుగులేని ఇమేజ్ పొందాడు. ఇక తారక్ పెర్పార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ‘నాన్నకు ప్రేమతో’లో వెరీ క్లాస్, ‘గ్యారేజ్’లో క్లాస్+మాస్ కలిపికొట్టి.. ఇరగదీసేశాడు.
ఇలా తారక్ సాధించిన రెండు విజయాలు, అవి రాబట్టిన వసూళ్లు, ఆ సినిమాలు అతనికి తెచ్చిపెట్టిన భారీ ఫాలోయింగ్‌ని బట్టి.. అతడు హీరో ఆఫ్ ది ఇయర్‌గా నిలిచాడు. మరో విశేషం ఏమిటంటే.. ఓవర్సీస్‌లోనూ ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు (3.8 మిలియన్ డాలర్స్) రాబట్టిన హీరోగానూ తారకే ముందు స్థానంలో నిలిచాడు. ఇక ‘రేడియో మిర్చి టాప్-10 సాంగ్స్ ఆఫ్ ది ఇయర్’లో ‘నాన్నకు ప్రేమతో’ మూవీలో ఈ యంగ్ టైగర్ పాడిన ‘ఫాలో ఫాలో’ పాట కూడా ఫస్ట్ ప్లేస్ సాధించడం కొసమెరుపు.