అయోధ్య రామమందిర నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం మధ్యాహ్నం ముహూర్తం సమయానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. కోటాను కోట్ల భారత హిందువుల వందల ఏల్ల నిరీక్షణ ఫలించిందని.. దేశ ప్రజల సంకల్పంతోనే అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరుగుతోందని చెప్పారు. మోదీ తన ప్రసంగాన్ని జై శ్రీరామ్ నినాదంతో ప్రారంభించారు. అలాగే జై శ్రీరామ్ నినాదాలు ఇక్కడ మాత్రమే కాదని.. ప్రపంచ వ్యాప్తంగా ధ్వనిస్తున్నాయన్నారు.
రామమందిరం నిర్మాణం కోసం ఎంతో మంది త్యాగాలు చేశారని.. ఈ త్యాగ ఫలితంగానే నేడు కల ఫలించి రామమందిరం ఏర్పాటు జరుగుతోందని… భారత జీవిన విధానంలోనే శ్రీరాముడు ఉన్నాడని మోదీ అన్నారు. మహాత్ముని అహింసా విధానంలో సైతం శ్రీరాముడు ఉన్నాడని మోదీ తెలిపారు. అంతకు ముందు భూమి పూజతో పాటు ఆలయ ప్రాంగణంలో పారిజాత మొక్కను మోదీ నాటారు.