టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్…. తెలంగాణ పోరటా వీరుడు కొమురం భీమ్ పాత్రలో … మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ విప్లవ వీరుడు అల్లూరి సీతారామ రాజుగా నటిస్తోన్న ఈ భారీ బడ్జెట్ సినిమాను డీవీవీ దానయ్య ఏకంగా రు. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే 70 శాతం షూటింగ్ కంప్లీట్ అయిన ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నా కరోనా నేపథ్యంలో షూటింగ్ వాయిదా పడడంతో ఎప్పుడు రిలీజ్ అవుతుందా ? అని కోట్లాది మంది సినీ అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
ఇక రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్) టైటిల్‌తో వస్తోన్న ఈ సినిమాలో తారక్ క్యారెక్టర్ గురించి అదిరిపోయే అప్‌డేట్ బయటకు వచ్చింది. ఆర్ఆర్ఆర్ లో తారక్ ఆరు గెటప్పులో కనపడనున్నారట. అదేంటి తారక్ ఏంటి కొమరం భీం పాత్రలో నటించే వ్యక్తి ఆరు గెటప్పులు వేయడం ఏంటని షాక్ అవుతున్నారా ? బ్రిటీష్ వారిని కన్నుగప్పే ప్రయత్నంలో తారక్ ఆరు గెటప్పులు వేసుకుంటారని అంటున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ తారలు అజయ్ దేవగణ్, ఆలియా భట్ తదితరులతో పాటు రే స్టీవెన్ సన్, అలిసన్ డూడీ వంటి హాలీవుడ్ స్టార్స్ నటిస్తున్నారు.