తెలంగాణలో కరోనా అధికార పార్టీ ఎమ్మెల్యేలను వదలడం లేదు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కరోనా భారీన పడ్డారు. తాజాగా మరో ఎమ్మెల్యే సైతం కరోనాకు గురయ్యారు. రామగుండం టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్టు తెలుస్తోంది. కొద్ది రోజులుగా కాస్త అస్వస్థతతో ఉన్న ఆయనకు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. చందర్ ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలి లోని ఓ పైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సింగరేణి వనమహత్సోవంలో ఎమ్మెల్యే, మేయర్‌కు కరోనా లక్షణాలు ఉన్నట్టు నిర్దారణ కావడంతో పరీక్షలు చేయించుకున్నారు.
ఇక ఈ ఒక్క రోజే మొత్తం ముగ్గురు తెలంగాణ ప్రజాప్రతినిధులకు కరోనా వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి కూడా కరోనా వచ్చిందని సమాచారం. ఇక ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, డ్రైవర్, గన్మెన్లకు కరోనా వచ్చిన సంగతి తెలిసిందే. ఏదేమైనా తెలంగాణ ప్రజాప్రతినిధులను కరోనా వదలడం లేదు.