ప్రపంచానికే చైనా కొద్ది సంవత్సరాలుగా పెద్ద ప్రమాదకారిగా మారిపోయింది. ప్రపంచాధిపత్యం కోసం చైనా ఆడుతోన్న వికృత క్రీడలో ప్రపంచం మొత్తం విలవిల్లాడుతోంది. ఇప్పటికే కరోనా వైరస్‌ను ప్రపంచం మీదకు వదిలి ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తోన్న చైనా ఇటు ఆసియాలో తనకు బలమైన పోటీదారుగా ఉన్న భారత్‌తో అనవసరంగా కయ్యానికి కాలు దువ్వుతోంది. ఇక గాల్వాన్ లోయలో చైనా దురాక్రమణ చేయడంతో పాటు జరిపిన కాల్పుల్లో 20 మంది భారత జవాన్లు అమరులు అయ్యారు. అయినా చైనా మాత్రం ఎప్పటికప్పుడు అగ్గి రాజేసే ప్రకటనలే చేస్తోంది. చైనా వికృత చర్యలను చూసి చూసి విసిగిపోయిన భారత్ ఎట్టకేలకు చైనాకు బుద్ధి చెప్పాలని నిర్ణయం తీసుకుంది.
భారత్‌లో సూపర్ పాపులర్ అయిన చైనా యాప్‌లు అన్నింటిని నిషేధించి చైనాకు తగిన బుద్ధి చెప్పిన భారత్ ఇక చైనా తోకలు క్రమక్రమంగా కత్తిరిస్తూ వస్తోంది. ఇప్పటికే చైనాతో ఉన్న విదేశీ వాణిజ్య సంబంధాలను కూడా చాలా వరకు తెంచుకున్న భారత్ ఇప్పుడు చైనాకు మరో అదిరిపోయే షాక్ ఇచ్చింది. భారత్‌లో కొత్త విద్యావిధానాన్ని అమలుకి కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఈ నూనత విద్యా విధానంలో భాగంగా భారతీయ విద్యార్థులు ఏ భాషలో అయినా విద్యను అభ్యసించవచ్చు.
అయితే ఈ జాబితా నుంచి కేంద్రం చైనీస్ భాషను తొలగించింది. ఈ నూతన విద్యా విధానం కోసం గతేడాది రూపొందించిన ముసాయిదా జాబితాలో చైనా భాష ఉన్నప్పటకీ తాజాగా విడుదల చేసిన తుది జాబితాలో మాత్రం చైనాకు చోటు లేదు. ఇక మన విద్యార్థులకు విదేశీ భాషలు ఫ్రెంచ్, జర్మన్, జపనీస్, కొరియన్, స్పానిష్, పోర్చుగీస్, రష్యన్, థాయ్ భాషలను ఆప్షన్లుగా కేంద్ర ప్రభుత్వం కల్పించింది.
ప్రపంచ భాషలను అభ్యసించడం వల్ల ప్రపంయ సంస్కృతి అంతా తెలుసుకోవచ్చని కూడా కేంద్రం స్పష్టం చేసింది. ఏదేమైనా వరుస షాకుల పరంపరలో కేంద్రం చైనాకు మరో అదిరిపోయే షాక్ ఇచ్చింది. డ్రాగన్‌కు భారత్ అసలు సిసలు దెబ్బేంటో క్రమంగా తెలుస్తోంది.