దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇప్పటికే 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. కరోనా జోరు మీద ఉండడంతో ఇప్పట్లో కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు కూడా ఈ సినిమా మళ్లీ పట్టాలెక్కే ఛాన్సులు కనపడడం లేదు. మరో వైపు దర్శకుడు రాజమౌళితో పాటు ఆయన కుటుంబానికి సైతం కరోనా పాజిటివ్ రావడంతో ఈ ఫ్యామిలీ అంతా హోం క్వారంటైన్‌లోనే ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కెమేరామెన్ సెంథిల్ కుమార్ చెప్పిన వివరాల ప్రకారం ఈ సినిమా కోసం 500 – 600 పనిచేసే సీన్ల కోసం కేవలం 40 – 50 మందితో పని చేయాలంటే పెద్ద సవాల్‌తో కూడుకున్న పనే అని చెపుతున్నారు.
ఇక రాజమౌళి సినిమాలంటే ఏ చిన్న విషయం కూడా బయటకు పొక్కదు. అలా జరిగితే రాజమౌళి వార్నింగ్ ఎలా ఉంటుందో ? తెలిసిందే. ఇప్పుడు కరోనా నేపథ్యంలో ఈ సినిమా కోసం పనిచేసిన వారు బయట ఉండడంతో వీరు చెపుతోన్న లీకుల ప్రకారం ఆర్ ఆర్ ఆర్‌లో అనుకోకుండా కలిసిన ఎన్టీఆర్ – రామ్ చరణ్ లు స్నేహితుల్లాగే కాకుండా అన్నదమ్ములుగా ఆకట్టుకుంటారట. సినిమాలో చాలా సీన్లు ఎమోషనల్‌గా ఉంటాయని చెపుతున్నారు.
ఇక కొమరం భీం, అల్లూరి సీతారామరాజు మధ్య ఎమోషనల్ బాండింగ్ సూపర్బ్‌గా ఉంటుందని చెపుతున్నారు. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ఓ భీకర పోరాట సన్నివేశంలో ఎన్టీఆర్ నటన పీక్స్‌లో ఉంటుందని చెపుతున్నారు. ఈ యాక్షన్ సీన్లో ఎన్టీఆర్ విరోచిత నటన తర్వాత ఎమోషనల్ సీన్లలో జీవించేస్తాడని.. ఈ పతాక సన్నివేశం ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యున్నత సన్నివేశంగా నిలిచి పోతుందని ఈ సినిమాకు పనిచేసిన వారు చెపుతున్నారు. ఈ క్లైమాక్స్ సీన్‌ను ఇప్పటికే కొంత వరకు షూట్ చేశారని.. జక్కన్న సైతం ఎన్టీఆర్ నటనకు మంత్ర ముగ్ధుడు అయ్యాడని చెపుతున్నారు.