Exclusive pre review of Allari Naresh latest film ‘Intlo Deyyam Nakem Bhayam’ which is directed by comedy movies specialist G.Nageswara Reddy under BVSN Prasad productions. In this movie Mouryani and Kruthika Jayakumar played female lead roles.
సినిమా : ఇంట్లో దెయ్యం నాకేం భయం
నటీనటులు : అల్లరి నరేష్, మౌర్యానీ, కృతిక, రాజేంద్రప్రసాద్, తదితరులు
దర్శకత్వం : జి.నాగేశ్వరరెడ్డి
నిర్మాత : బీవీఎస్ఎన్ ప్రసాద్
సంగీతం : సాయి కార్తీక్
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర
వరుస పరాజయాలతో సతమతమవుతున్న అల్లరి నరేష్.. ఈసారి డిఫరెంట్ కాన్సెప్ట్‌ని ఎంచుకున్నాడు. కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ జి.నాగేశ్వరరెడ్డితో కలిసి.. ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ సినిమా చేశాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో రూపొందిన ఈ మూవీలో నరేష్ సరసన మౌర్యానీ, కృతిక జయకుమార్‌లు హీరోయిన్లుగా నటించారు. ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ రావడంతో దీనిపై మంచి అంచనాలే నెలకొన్నాయి. మరి.. వాటిని అందుకుంటుందో? లేదో? చూడాలి.
కథ (కల్పన మాత్రమే) :
ఓ ఇల్లు కోసం రాజేంద్రప్రసాద్ వెతుకుతుండగా.. చాలాకాలం నుంచి ఖాళీగా ఉన్న ఓ ఇల్లు దొరుకుతుంది. పైగా.. తక్కువ ధరకే ఇస్తామని ఇంటి యజమాని చెప్పడంతో.. ఆ ఇంట్లోకి తన ఫ్యామిలీతో చేరుతాడు రాజేంద్రప్రసాద్. మొదట్లో అంతా బాగానే ఉంటుంది కానీ.. రానురాను వారికి విపరీతమైన అనుభవాలు ఎదురవుతాయి. చివరికి తమ ఇంట్లో దెయ్యం ఉందని తెలుస్తుంది. దాని బారినుంచి బయటపడేందుకు భూతవైద్యుడ్ని సంప్రదిస్తారు. అప్పుడు అల్లరి నరేష్ భూతువైద్యుని వేషం వేసుకుని వాళ్ల ఇంటికి వెళతాడు. ఏవో కట్టుకథలు చెప్పి.. ఆ ఇంట్లోనే తిష్టవేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? అసలు ఆ ఇంట్లో తిరుగుతున్న ఆత్మ ఎవరిది? ఇంతకీ అల్లరి నరేష్ ఎందుకు భూతవైద్యుని వేషం వేసుకుని వస్తాడు? చివరికి కథ ఎలాంటి మలుపులు తిరిగింది? అనే ఆసక్తికరమైన అంశాలతో సినిమా సాగుతుంది.
విశ్లేషణ :
దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డిని కామెడీ సినిమాల స్పెషలిస్ట్‌గా ఎందుకు అభివర్ణిస్తారో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఈ మూవీ మొత్తంలో కడుపు చెక్కలయ్యే కామెడీతో ఆయన హిల్లేరియస్‌గా తెరకెక్కించాడు. అక్కడక్కడ కొన్ని బోరింగ్ ఎపిసోడ్స్ ఉన్నప్పటికీ.. ఆ తర్వాత వచ్చే కామెడీ సీన్లు వాటిని డామినేట్ చేసేస్తాయి. సినిమాలోకి దెయ్యం ఎంటరైనప్పటి నుంచి కామెడీ పీక్ స్టేజ్‌లోకి వెళుతుంది. భయపెట్టే సన్నివేశాలను కూడా సరదాగా చూపించడంతో అవి జనాల్ని బాగానే నవ్వించాయి. సందర్భానుకూలంగా వచ్చే పాటలు కూడా వినసొంపుగానే ఉన్నాయి. ఈ సినిమా మొత్తంలో అల్లరి నరేష్ మొదటి హీరో అయితే.. రాజేంద్రప్రసాద్ సెకండ్ హీరో. ఈయన తన కామెడీ టైమింగ్‌తో ఇరగదీశారంతే. నరేష్, ప్రసాద్ కాంబోలో వచ్చే సన్నివేశాలు బాగా వచ్చాయి. ఓవరాల్‌గా.. ఈ చిత్రం ఆడియెన్స్‌ని మెప్పించడంలో సక్సెస్ అయ్యింది.
నటీనటుల పనితీరు :
అల్లరి నరేష్ ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకున్నాడు. తన కామెడీ టైమింగ్‌తో బాగా నవ్వించాడు. భూతవైద్యుని గెటప్‌లో భలే అలరించాడు. మౌర్యానీ, కృతిక జయకుమార్‌లు తమ అందాల్ని ఆరబోయడంతోపాటు నటనతోనూ మెప్పించారు. రాజేంద్రప్రసాద్ ఈ మూవీకి మరో హైలైట్. తన కామెడీ టైమింగ్‌తో పొట్టచెక్కలయ్యేలా నవ్వించేశారు. అల్లరి నరేష్ పక్కన నటించిన షకలక శంకర్, చమ్మక్ చంద్రలు నవ్వించడానికి బాగానే ప్రయత్నించారు. మిగతా నటీనటులు తమ పాత్ర పరిధి బాగానే నటించారు.
సాంకేతిక పనితీరు :
సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ని గ్రాండ్‌గా చూపించారు. కొన్ని చోట్ల కెమెరా పనితనాన్ని మెచ్చుకోలేక ఉండలేం. సాయికార్తీక్ అందించిన పాటలు బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరింది. ఎడిటింగ్, ఆర్ట్ వర్క్ బాగున్నాయి. నిర్మాణ విలువలకు ఎక్కడా వంక పెట్టలేం. ఇక జి.నాగేశ్వరరెడ్డి గురించి మాట్లాడితే.. ఎప్పటిలాగే తన ప్రతిభతో ఆడియెన్స్‌ని మెప్పించడంతోపాటు కడుపుబ్బా నవ్వించడంలో సక్సెస్ అయ్యాడు.
ఫైనల్ వర్డ్ : ఈ సినిమాతో అల్లరోడు మళ్ళీ ఫామ్‌లోకి రావాలని కోరుకుంటున్నాం.