స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం అలా వైకుంఠపురంలో చిత్రం. ఈచిత్రానికి సంబంధించిన ఓ పాటను యూట్యూబ్‌లోకి వదిలారు చిత్ర యూనిట్.. ఇక అంతే … పాట రిలీజ్ అయిన క్షణం నుంచి తీరికలేకుండా లైక్‌లు, వ్యూస్ వస్తూనే ఉన్నాయి.. ఇక డౌన్‌లోడ్ చేసుకోవడం, వీక్షించడంతో ఈ పాట ఇప్పుడు రికార్డులు బద్దలు కొల్లగొడుతుంది..
అంటే ఈ వ్యూస్, లైక్‌లు ప్రేక్షకులు చేస్తున్నారా… లేక అభిమానులే చేస్తునారో తెలియదు కానీ.. ఇది మాత్రం కావాలనే కొందరు పనిగట్టుకుని చేస్తున్నారనేది మాత్రం ఈ వ్యూస్, లైక్స్ చూస్తుంటే అర్థమవుతుందని సిని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఏ పాటైనా రిలీజ్ అయిన 24గంటల్లో అత్యధిక వ్యూస్, లైక్‌లు సాధించడం అంటే అది మామూలు విషయం కాదు.. కానీ ఈ పాట రిలీజ్ చేసిన క్షణం నుంచి క్షణక్షణాకి, నిమిష నిమిషానికి, గంట గంటకూ వ్యూస్ పెరిగిపోతూనే ఉన్నాయి…
సామజవరగమన అనే ఈ లిరిక్‌తో వచ్చిన ఈ పాట వ్యూస్ ఎలా పెరిగిపోయాయో ఓసారి చూస్తే అర్థమవుతుంది.. ఇది యాదృశ్చికమో లేక అభిమానుల పనో.. ఫాస్టెస్ట్ మిలియన్ వ్యూస్ (90 నిమిషాలు), ఫాస్టెస్ట్ 2 మిలియన్ వ్యూస్ ((3 గంటలు), ఫాస్టెస్ట్ 3 మిలియన్ వ్యూస్ (7 గంటలు), ఫాస్టెస్ట్ 4 మిలియన్ వ్యూస్ (10 గంటలు), ఫాస్టెస్ట్ 5 మిలియన్ వ్యూస్ (13 గంటలు), ఫాస్టెస్ట్ 6 మిలియన్ వ్యూస్ (24 గంటలు).. ఇక్కడితో అయిపోలేదు. ఇంకా ఉంది. ఫాస్టెస్ట్ 50 వేల లైక్స్ (35 నిమిషాలు), ఫాస్టెస్ట్ లక్ష లైక్స్ (88 నిమిషాలు), ఫాస్టెస్ట్ 1.5 లక్షల లైక్స్ (3 గంటల 8 నిమిషాలు), ఫాస్టెస్ట్ 2 లక్షల లైక్స్ (6 గంటల 12 నిమిషాలు), ఫాస్టెస్ట్ 2.5 లక్షల లైక్స్ (10 గంటల 22 నిమిషాలు), ఫాస్టెస్ట్ 3 లక్షల వ్యూస్ (22 గంటల 5 నిమిషాలు). అంటే ఇలా వ్యూస్, లైక్‌లు పెరిగిపోవడానికి కారణం బన్నీబాబు అభిమానులు రంగంలోకి దిగి ఇలా రికార్డు దిశగా నడుపుతున్నారనేది స్పష్టం..