Newsతారక్‌ విజ్ఞానానికి దండం పెట్టిన కళ్యాణ్ రామ్.. ‘నీతో కష్టంరా బాబు’!

తారక్‌ విజ్ఞానానికి దండం పెట్టిన కళ్యాణ్ రామ్.. ‘నీతో కష్టంరా బాబు’!

The reason behind Kalyan Ram salutes NTR is out. According to sources, he salutes him after knowing knowledge on cultural activities.

తమ సోదరుడు జానకీరామ్ కుమారులైన మాస్టర్ ఎన్టీఆర్, సౌమిత్ర ప్రభాకర్‌ల ‘పంచెకట్టు’ కార్యక్రమానికి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ పాల్గొన్న విషయం తెలిసిందే. కుటుంబం మొత్తం అంగరంగ వైభవంగా జరుపుకున్న ఈ వేడుకలో ఓ అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. అదే.. ఓ సందర్భంలో తారక్‌కి కళ్యాణ్ రామ్ దండం పెట్టడం. ఈ ఫోటో లీకైనప్పటి నుంచి.. కళ్యాణ్ ఎందుకు తన తమ్ముడు ఎన్టీఆర్‌కి దండం పెట్టాడని చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఆ ఘట్టం వెనుక కారణమేంటో ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది.

ఈ ఈవెంట్ సందర్భంగా.. కళ్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్‌ల మధ్య ఈ వేడుక జరగాల్సిన పద్దతి, సాంప్రదాయాలపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే తారక్ వాటిపై తనకున్న అవగాహన తెలిపాడు. దీంతో ఎన్టీఆర్‌కు ఈ సాంప్రదాయాలపై ఉన్న పట్టు చూసి.. కళ్యాణ్‌రామ్‌ అతనికి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టాడట. అంతేకాదు.. ‘నీతో కష్టంరా బాబూ… నీతో మాట్లాడటం అంత ఈజీకాదు… నన్నొదిలేయ్‌’ అంటూ వ్యాఖ్యానించాడట. ఇలా ఈ విధంగా అన్నాదమ్ముల మధ్య చర్చ జరగడం అందరిలోనూ ఆసక్తి రేపింది. ఆ వేడుకలోనే ప్రత్యేక అంశంగా నిలిచింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news