గణనాథుల శోభాయాత్ర కొనసాగుతోంది. ఈ ఉదయం నుంచి నగరంలో పలు చోట్ల గణనాథుల నిమజ్జనోత్సవం కొనసాగుతోంది. ఇక ఎక్కడికక్కడ లడ్డూల వేలం ప్రక్రియ కూడా జరుగుతోంది. దేశవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తోన్న బాలాపూర్ గణేషుడి లడ్డూ మరోసారి వేలంలో రికార్డు క్రియేట్ చేసింది. బాలాపూర్ వినాయకుడి లడ్డు వేలం ముగిసింది. లడ్డు వేలంలో ఈ సారి 28 మంది పోటీలో ఉన్నారు. గత సంవత్సరం లడ్డు రూ.16లక్షల 60000 పలికిన సంగతి తెలిసిందే.
ఇక ఈ యేడాది గత యేడాది రికార్డును బద్దలు కొడుతూ లడ్డూ వేలంలో అమ్ముడు పోయింది. కొలను రామిరెడ్డి రూ. 17.60 లక్షలకు లడ్డూ సొంతం చేసుకున్నారు. గత యేడాది కంటే రూ.లక్షకు ఎక్కువుగా లడ్డూ అమ్ముడైంది. వాస్తవంగా ఆర్థికమాంద్యం నేపథ్యంలో ఈ యేడాది లడ్డూ ఈ యేడాది అంత రేటు పలుకుతుందా ? అన్న సందేహాలు వచ్చినా అవన్నీ వేలంలో పటాపంచలు అయ్యాయి.
ఇక 1994 నుంచి ఈ లడ్డూ వేలం జరగుతూ వస్తోంది. ఈ లడ్డూ ఎక్కువ సార్లు కొలను కుటుంబానికి చెందిన వారే సొంతం చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా మరోసారి అదే కుటుంబానికి చెందిన కొలను రామిరెడ్డి రూ 17.60 లక్షలకు సొంతం చేసుకున్నారు.