బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన `సాహో` కోసం దేశమంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్లు సినిమాపై అంచనాలను తారస్థాయికి పెంచేశాయి. సాహో ఈ నెల 30న థియేటర్లలోకి వస్తోంది. ఇప్పటికే దేశం మొత్తం సాహో ఫీవర్‌తో ఊగిపోతోంది. కేవలం తెలుగు సినిమా లవర్స్ మాత్రమే కాకుండా… ఇటు సౌత్, అటు నార్త్ ఇండియన్ సినిమా అభిమానులు సైతం సాహో సాహో అంటూ సాహో నామస్మరణ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సినిమా ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రముఖ జర్నలిస్ట్, సినీ విమర్శకుడు, యూకే సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు `సాహో` సినిమా చూసి సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించారు. మొత్తం మూడు ట్వీట్లతో సాహో గురించి తన అభిప్రాయం చెప్పాడు. సాహో ఫస్టాఫ్ చాలా అద్భుతంగా ఉందని… ప్రభాస్ ఎంట్రీతోనే సినిమా పైసా వసూల్ అయిపోతుందన్నాడు. ఛేజింగ్‌లు, యాక్షన్ సీక్వెన్సులకు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయని ఫస్ట్ ట్వీట్ చేశాడు.
ఇక నెగిటివ్ రోల్ ఉన్న ప్రభాస్‌ను చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుందని… ఇంత కూల్ గా దొంగతనాలు చేసే పాత్రలో మరొకర్ని ఊహించుకోలేమని రెండో ట్వీట్ చేశారు. ఓవరాల్‌గా సాహో ఒక గొప్ప యాక్షన్ ఎంటర్‌టైనర్. టన్నుల కొద్దీ వినోదాన్ని ప్రేక్షకులకు పంచారు. బ్లాక్‌బస్టర్‌ను మించి అవుతుందని… సింపుల్ గ్రేస్‌తో నటించిన ప్రభాస్ నిజమైన పాన్ ఇండియా స్టార్ అంటూ ఉమైర్ వరుస ట్వీట్లు చేశారు. ఏదేమైనా ఉమర్ ట్విట్‌తో సినిమాపై అంచనాలు ఆకాశంలోకి వెళ్లిపోయాయి.