యంగ్ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా రణరంగం రిలీజ్‌కు ముందు అదిరిపోయే క్రేజ్ సాధించింది. సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ గురువారం రిలీజ్ అయ్యి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. కానీ రివ్యూలు మాత్రం అంత మంచిగా రాలేదు. దీనికి తోడు ఎవరు వంటి సస్పెన్స్ థ్రిల్లర్ కూడా పోటీలో ఉండటంతో ఈ సినిమా కలెక్షన్లపై ప్రభావం పడింది.
మొదటి వారాంతం ముగిసే సరికి రణరంగం కేవలం 7.66 కోట్లు మాత్రమే వసూలు సాధించింది. శర్వానంద్ యాక్టింగ్ పరంగా బాగున్నా సినిమా బోరింగ్‌గా ఉండటంతో జనాలు తలలు పట్టుకున్నారు. ముఖ్యంగా ఓవర్సీస్లో ఈ సినిమా దారుణమైన కలెక్షన్లు రాబడుతోంది. ఇక వీక్ డేస్‌లో ఈ సినిమా పుంజుకుంటేనే నిర్మాతలు పెట్టిన మొత్తాన్ని తెచ్చుకోగలరు. లేదంటే వారికి నష్టాలు తప్పవనే అంటున్నారు సినీ ఎక్స్పర్ట్స్. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.
నైజాం – 2.75 కోట్లు
సీడెడ్ – 1.23 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.10 కోట్లు
తూ.గో – 0.51 కోట్లు
ప.గో – 0.47 కోట్లు
కృష్ణా – 0.55 కోట్లు
గుంటూరు – 0.73 కోట్లు
నెల్లూరు – 0.32 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 7.66 కోట్లు