నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం గ్యాంగ్ లీడర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నాని ‘v’ అంటూ మరో ప్రయోగం చేస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత నాని ఓ బాలీవుడ్ సినిమా రీమేక్ చేస్తాడని అంటున్నారు. లాస్ట్ ఇయర్ ఆయుష్మాన్ ఖురాన నటించిన అంధాధన్ సినిమా రీమేక్ లో నాని నటిస్తాడని తెలుస్తుంది. శ్రీరాం రాఘవన్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధిక ఆప్టే నటించారు.
ఈ సినిమాకు గాను ఆయుష్మాన్ ఖురానాకు బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ వచ్చింది. బెస్ట్ మూవీగా కూడా అంధాధన్ సినిమాకు జాతీయ అవార్డ్ వచ్చింది. అందుకే నాని ఈ సినిమా తెలుగు ఆడియెన్స్ కు అందించాలని చూస్తున్నారు. తెలుగులోనే కాదు తమిళంలో సిద్ధార్థ్ తో ఈ సినిమా రీమేక్ చేయాలని చూస్తున్నారట. తెలుగు, తమిళ సినిమాలు వేరైనా ప్రొడక్షన్ ఒకటే అని తెలుస్తుంది.
ఈమధ్య తెలుగు సినిమాలు ఎక్కువగా బాలీవుడ్ లో రీమేక్ అవుతున్నాయి. కాని అంధాధన్ మాత్రం తెలుగులో రీమేక్ అవుతుంది. బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమా తెలుగులో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. నేషనల్ అవార్డ్ సినిమాపై కన్నేసిన నాని ప్లాన్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.