After watching the sweet fight between Salman Khan and Aamir Khan on twitter.. natural star nani makes a shocking comment on tollywood heroes and star heroes.
నేచురల్ స్టార్ నాని ఎవ్వరి జోలికి వెళ్ళడు. తన పనేంటో తాను చేసుకుంటూ.. నలుగురితో స్నేహంగా మెలుగుతాడు. ఎవరి గురించైనా చెప్పాల్సి వస్తే.. వారిపై పొగడ్తల వర్షమే కురిపిస్తాడే తప్ప బ్యాడ్‌గా ఒక్క మాట కూడా మాట్లాడడు. ఒకవేళ తనకంటే చిన్నవాడైతే.. కెరీర్‌ని ఎలా మలచుకోవాలో సూచనలిస్తాడు. అలాంటి ఈ హీరో.. తొలిసారి టాలీవుడ్ స్టార్ హీరోల మీద ఓ షాకింగ్ కామెంట్ చేశాడు. అదేంటో తెలిస్తే.. మీరూ అతడ్ని అభినందిస్తారు. ఇంతకి అతను చేసిన ఆ కామెంట్ ఏంటో తెలియాలంటే.. మేటర్‌లోకి వెళ్ళాల్సిందే.
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘దంగల్’ ఈ శుక్రవారం రిలీజైన విషయం తెలిసిందే. ఈ సినిమాని చూసిన ప్రతిఒక్కరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. దిగ్గజాలు సైతం ఈ మూవీని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇక కండలవీరుడు సల్మాన్ ఖాన్ అయితే ఈ సినిమా చూశాక ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. ‘నా ఫ్యామిలీ మొత్తం ‘దంగల్’ సినిమా చూసింది. ఈ చిత్రం నా ‘సుల్తాన్’కంటే చాలా బెటర్‌గా ఉందని భావిస్తున్నాను. ఆమిర్.. పర్సనల్‌గా నువ్వుంటే నాకెంతో ఇష్టం కానీ ప్రొఫెషనల్‌గా నిన్ను ద్వేషిస్తున్నాను’ అంటూ ట్వీటాడు. ఇందుకు ఆమిర్ కూడా భలే రిప్లై ఇచ్చాడు. ‘నీ ద్వేషంలో కూడా నాకు ప్రేమే కనిపిస్తోంది సల్మాన్’ అంటూ ట్వీటాడు. దీన్ని బట్టి.. ఆ ఇద్దరిమధ్య ఎలాంటి బంధం ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రతిఒక్కరి మనసుని హత్తుకున్న వారి ట్వీట్లపై అందరూ ఆనందంగా స్పందించారు. నేచురల్ స్టార్ నాని కూడా తనదైన శైలిలో రియాక్ట్ అయ్యాడు. మన స్టార్ హీరోలు కూడా ఇలాగే ఉంటే చాలా బాగుంటుందని సూచించాడు. ‘మన స్టార్స్, సూపర్‌స్టార్స్ కూడా ఆమీర్, సల్మాన్‌లాగే ఉంటే ఎంతో బాగుంటుంది.. ఇండస్ట్రీలో ఆరోగ్యవంతమైన కాంపిటీషన్ ఉండాలి.. అప్పుడే మంచి సినిమాలు వస్తాయి’ అంటూ టాలీవుడ్‌కి ఓ సూచన ఇచ్చాడు నాని. బాలీవుడ్‌లో స్టార్ హీరోల మధ్య ఎలాంటి మనస్పర్థలు ఉండవని, తమ సినిమాలు రిలీజైనప్పుడు ప్రశంసలు కురిపించుకుంటారే తప్ప, బేధాభిప్రాయాలేవీ పెట్టుకోరని, అలాగే మన తెలుగు స్టార్ హీరోలు స్నేహాభావంగా మెలిగితే చాలా బాగుంటుందన్న అభిప్రాయాన్ని నాని ట్విటర్ వేదికగా వెల్లడించాడు.
నిజానికి.. మన తెలుగు హీరోల మధ్య అంతగా అనుబంధం లేదు. పైపెచ్చుగా అందరం ఒక్కటేనని అనుకుంటారే తప్పితే.. ఏ ఒక్కరూ ఇతర హీరోల సినిమాలపై స్పందించరు. తమ కుటుంబానికి చెందిన హీరోలను పొగుడుకోవడమే తప్పించి.. ఇతర హీరోల సినిమాల గురించి కాంప్లిమెంట్లు ఏమీ ఇవ్వరు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే.. నాని అలా ట్వీట్ చేశాడని స్పష్టంగా అర్థం అవుతోంది. చూద్దాం.. హీరోల్లో మార్పు వస్తుందా? రాదా?
I so wish our “stars and super stars” do this .. Cinema deserves a healthy competition .. We all deserve good movies . https://t.co/LYmA4ZP7dZ
— Nani (@NameisNani) 23 December 2016