విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్మ డైరక్షన్ లో క్రేజీ మూవీగా వస్తున్న సినిమా డియర్ కామ్రేడ్. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా జూలై 26న సౌత్ అన్ని భాషల్లో గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఇప్పటికే సినిమా మీద భారీ అంచనాలు ఉండగా సినిమా ప్రమోషన్స్ తో వాటిని మరింత పెంచేస్తున్నారు విజయ్, రష్మిక. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో కూడా ఈ సినిమా క్రేజీగా మారింది.
ఇక ఈ సినిమాకు మరో బంపరాఫర్ వచ్చింది. ఈ సినిమా రీమేక్ రైట్స్ ను బాలీవుడ్ దిగ్గజ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ దక్కించుకున్నారు. కరణ్ కొన్నాడు అంటే కచ్చితంగా సినిమాలో మ్యాటర్ బాగానే ఉన్నదని అర్ధం చేసుకోవచ్చు. ఆల్రెడీ కరణ్ సినిమా చూసి సూపర్ ఇంటెన్స్ స్టోరీ అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. చూస్తుంటే డియర్ కామ్రేడ్ కూడా అర్జున్ రెడ్డి తరహాలో మరో సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది.
విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా హిందిలో కబీర్ సింగ్ గా రీమేక్ అయ్యింది. మాత్రుక దర్శకుడు సందీప్ వంగ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఇప్పుడు డియర్ కామ్రేడ్ కూడా అదే రేంజ్ లో రాబోతుంది. మరి డియర్ కామ్రేడ్ రీమేక్ లో హీరో ఎవరు.. డైరక్షన్ ఎవరు చేస్తారన్నది తెలియాల్సి ఉంది. విజయ్ దేవరకొండ సినిమాలు బాలీవుడ్ లో వరుస రీమేక్ అవడం చూస్తుంటే మనవాడి క్రేజ్ కూడా అంతకూంత పెరుగుతుందని చెప్పొచ్చు.