Young tiger NTR become the overseas highest grosser of 2016 with his two films Nannaku Prematho and Janatha Garage.
స్టార్ హీరోలందరికీ టాలీవుడ్‌లో మంచి మార్కెట్టే ఉంది. యావరేజ్, బిలో యావరేజ్ టాక్ వచ్చినా.. వారి సినిమాలు ఎంతలేదన్నా రూ.40 కోట్లపైనే షేర్ సాధిస్తాయి. కానీ.. ఒక్క ఏరియాలో మాత్రం అందరికంటే మహేష్‌బాబే తోపు అనిపించుకున్నాడు. అదే.. ఓవర్సీస్‌లో! ఇతర హీరోల సినిమాలకి ఫ్లాప్ టాక్ వస్తే.. రెండోరోజే అక్కడి బాక్సాఫీస్ వద్ద అవి చతికిలపడిపోతాయి. కానీ.. మహేష్ మూవీలు మాత్రం అవలీలలగా మిలియన్ డాలర్లు సాధిస్తున్నాయి. అందుకు ఉదాహరణగా ‘బ్రహ్మోత్సవం’ని తీసుకోవచ్చు. డిజాస్టర్ టాక్ వచ్చినా.. మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరిపోయింది. దీంతో.. ఇతనికి ‘ఓవర్సీస్ కింగ్’ అనే పేరొచ్చింది.
అయితే.. ఈ ఏడాదిలో మాత్రం అతనికంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తోపు అనిపించుకున్నాడు. నిజానికి.. ఇతనికి మొదట్లో ఓవర్సీస్‌లో మార్కెట్ అస్సలు కలిసి రాలేదు. ఇతని సినిమాలు ఇక్కడ భారీ విజయాలు సాధించినా.. అక్కడ సత్తా చాటలేకపోయాయి. కానీ.. తొలిసారి ‘బాద్‌షా’తో తారక్ మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరాడు. అది కాస్త డిఫరెంట్ జోనర్ కావడం, కామెడీ బీభత్సంగా ఉండడంతో అక్కడ వర్కౌట్ అయ్యింది. ఆ తర్వాత చేసిన ‘టెంపర్’, ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్’ సినిమాలు మిలియన్ డాలర్లు సాధించాయి. దీంతో.. మహేష్ తర్వాత అత్యధిక సార్లు ఈ ఫీట్ సాధించిన హీరోగా తారక్ రికార్డు పుటలకెక్కాడు. అంతేకాదు.. ఈ ఏడాదిలో తన రెండు సినిమాల ద్వారా 3.8 మిలియన్ డాలర్లు సాధించి.. ఈ ఇయర్‌లో అత్యధిక గ్రాస్ సాధించిన తెలుగు హీరోగా కిరీటం దక్కించుకున్నాడు.
ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా 2.02 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన ‘జనతా గ్యారేజ్’ 1.8 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. ఈ రెండింటిని కలుపుకుంటే.. 3.8 మిలియన్ డాలర్స్ ఎన్టీఆర్ సాధించాడన్నమాట. ‘బాహుబలి’ మినహా ఒకే ఏడాదిలో అంతమొత్తం కలెక్ట్ చేసింది తారకే.