Newsఏటీఎంల్లో నగదు పరిమితిపై కేంద్రం మరో సంచలన నిర్ణయం..?

ఏటీఎంల్లో నగదు పరిమితిపై కేంద్రం మరో సంచలన నిర్ణయం..?

Central minister Santosh Ganguar made an sensational announcement on ATM transactions limit. He told that central government planning to lift this limit after december 30.

పెద్ద నోట్ల (500, 1000)ను రద్దు చేసిన తర్వాత ఏటీఎంల్లో నగదు లావాదేవీలపై కేంద్రం పరిమితి విధించిన విషయం తెలిసిందే. తొలుత కొన్నిరోజుల పాటు రూ.2,000 మాత్రమే నగదు అందించగా.. ఆ తర్వాత రూ.2,500కు పెంచింది. కొత్త నోట్లు ఇంకా ప్రింట్ చేస్తుండడంతో.. ఆలోపు డబ్బు ప్రతిఒక్కిరకీ చేరాలన్న ఉద్దేశంతో కేంద్రం పరిమితి విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఇకనుంచి ఈ నిబంధనని ఎత్తివేయాలని కేంద్రం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. అవును.. మీరు చదువుతోంది నిజమే.

డిసెంబర్ 30వ తేదీ తర్వాత ఏటీఏంల్లో లావాదేవీలపై విధించిన పరిమితిని ఎత్తివేయాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్రమంత్రి సంతోష్ గంగ్వార్ ప్రకటించారు. డిసెంబర్ 30లోపు ప్రస్తుతమున్న కఠిన పరిస్థితులు సాధారణ స్థితిలోకి వస్తాయని ఆశిస్తున్నామని, ఇప్పటికే చాలాచోట్ల బ్యాంకు సేవలు మెరుగుపడ్డాయని, 30లోపు ఇతర బ్యాంకు సేవలు కూడా మెరుగుపడతాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ నిర్ణయం చర్చల దశలో ఉందని చెప్పారు. గతంలోనూ (డిసెంబర్ 16న) ఆర్థిక కార్యదర్శి అశోక్ లవస కూడా డిసెంబర్ 30 తర్వాత ఏటీఎంల్లో విత్‌డ్రా పరిమితులపై సమీక్షిస్తున్నామని ప్రకటించడంతో.. కేంద్రం ఆ నిర్ణయం నిజంగానే ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే గనుక జరిగితే.. త్వరలోనే సామాన్యులకు నోట్లకష్టాలు తీరుతాయి.

ఇదిలావుండగా.. ఇప్పటికీ దేశవ్యాప్తంగా నోట్ల కొరత సమస్య అందరినీ పీడిస్తోంది. బ్యాంకుల్లో, ఏటీఎంల్లో డబ్బుల్లేక జనాలు అవస్థలు పడుతున్నారు. వేలాదిమంది జనాలు క్యూలో నిల్చుంటున్నారు. కొందరు మాత్రమే నగదు తీసుకుని సంతృప్తిగా ఇంటికి చేరుకుంటుంటే.. మరికొందరు మాత్రం ఒట్టి చేతులతోనే వెనుదిరుగుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news