Finally, Ram Charan’s latest movie Dhruva has entered USA top-5 2016 list by beating Pelli Choopulu collections.
కెరీర్ ప్రారంభం నుంచి రామ్ చరణ్ దేనికోసమైతే ఆరాటపడ్డాడో.. చివరికి దాన్ని ‘ధృవ’తో అందుకోగలిగాడు. తన సత్తా ఏంటో ఈసారి నిరూపించుకున్నాడు. ఇంతకీ అదేంటి అనుకుంటున్నారా! మరేదో కాదు.. యూఎస్‌లో 1 మిలియన్ క్లబ్లో చేరడం. టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుని.. ఇక్కడ యావరేజ్, బిలో యావరేజ్ సినిమాలతోనూ బాక్సాఫీస్ దగ్గర 40 కోట్ల మార్క్‌ని అవలీలగా అందుకుంటున్నాడు కానీ.. యూఎస్‌లో 1 మిలియన్ క్లబ్లో చేరలేకపోయాడు. ఇప్పుడు ‘ధృవ’ ద్వారా ఆ కలని సాకారం చేసుకున్నాడు. ప్రీమియర్స్‌తో కలుపుకుని తొలి ఆరురోజుల్లోనే ఆ ఫీట్‌ని అందుకోగలిగాడు.
ఆ ఫీట్‌ని అందుకున్న తర్వాత రామ్ చరణ్‌కి మరో పరీక్ష ఎదురైంది. ఫస్ట్ వీకెండ్ తర్వాత వసూళ్లు ఉన్నట్లుండి భారీగా డ్రాప్ అవ్వడంతో.. ఈ ఏడాదిలో యూఎస్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్-5 జాబితాలో చోటు సంపాదిస్తాడా? లేదా? అనే సందేహం నెలకొంది. ‘పెళ్ళిచూపులు’ లాంటి చిన్న సినిమా టాప్-5లో ఉన్నప్పుడు.. రామ్ చరణ్‌లాంటి స్టార్ హీరో అందులో స్థానం దక్కించుకుంటాడా? లేదా? అన్నది హాట్ టాపిక్ అయ్యింది. చివరికి.. ఆ రికార్డ్‌ని కూడా కైవసం చేసుకున్నాడు. అక్కడ సెకండ్ వీకెండ్లో మంచి వసూళ్లు రావడంతో.. ‘పెళ్ళిచూపులు’ వెనక్కి వెళ్లిపోయి, ‘ధృవ’ ఐదో స్థానాన్ని ఆక్రమించుకోగలిగింది. మొత్తానికి.. 1 మిలియన్ క్లబ్లో చేరాక, ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన జాబితాలోనూ చరణ్ స్థానం సంపాదించుకోగలిగాడు.
యూఎస్‌లో 2016లో హయ్యెస్ట్ వసూళ్లు రాబట్టిన టాప్-5 సినిమాలు :
1. అ..ఆ : $2.49 M
2. నాన్నకు ప్రేమతో : $2.02 M
3. జనతా గ్యారేజ్ : $1.81 M
4. ఊపిరి : $1.51 M
5. ధృవ : $1.24 M