తెలుగు సినిమా పేరు చెప్తే చాలు ముందు గుర్తుకు వచ్చేది నందమూరి వంశం. తెలుగు సినిమాకు మంచి పేరు ప్రఖ్యాతలు రావడానికి కారణమైన నందమూరి తారక రామారావు నట సింహం గా మంచి పేరు తెచ్చుకున్నాడు. అంతేనా తన తరువాత ఆ పేరు చిరస్థాయిగా ఉండిపోయేలా తన వారసులను రంగంలోకి దించాడు. ఆ వారసులు తమ వారసులను కూడా రంగంలోకి దించి నందమూరి అనే పేరు సినిమా ఇండ్రస్ట్రీ కి దూరం అవ్వకుండా చూసుకుంటున్నారు.
నందమూరి బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారక రత్న తమ కంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బాలకృష్ణ ఆరుపదుల వయసులోనూ హీరోగా ఖాళీ లేకుండా హిట్ సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే తన నట వారసుడిగా మోక్షజ్ఞను వెండి తెర మీద చూసుకోవాలని ఆరాటపడుతున్న బాలయ్య ఆశలకు కొన్ని కొన్ని కారణాలు నీళ్లు జల్లుతున్నాయి.
ముఖ్యంగా మోక్షజ్ఞ ఎంట్రీని ‘ఎన్టీఆర్’ అడ్డుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఎన్టీఆర్ బయోపిక్ కంటే ముందే మోక్షజ్ఞను లాంచ్ చేసే కంటే.. ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ చేసి అది ఘనవిజయం సాధించిన తర్వాత మోక్షజ్ఞ తెరపైకి వస్తే బాగుంటుందని బాలయ్య ఆలోచన చేసాడట. కానీ అనూహ్యంగా ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో బాలయ్య వెనక్కి తగ్గిపోయాడు. ఎన్టీఆర్ బయోపిక్ టాలీవుడ్ లో అతి పెద్ద డిజాస్టర్ల జాబితాలో చేరిపోవడంతో మోక్షజ్ఞ ఎంట్రీ కి బ్రేక్ పడిపోయింది. ఇప్పుడున్న ప్రతికూల పరిస్థితుల్లో మోక్షజ్ఞ ఎంట్రీ అంత శ్రేయస్కరం కాదనే అభిప్రాయానికి వచ్చి వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది.