Gossipsఅతడి చేతిలో ఘోరంగా మోసపోయిన శృతిహాసన్..!

అతడి చేతిలో ఘోరంగా మోసపోయిన శృతిహాసన్..!

సినిమా వాళ్ల ప్రేమలు, పెళ్లిళ్లు ఎంత కాలం ఉంటాయో ఎంతకాలంలో పెటాకులవుతాయో చెప్పలేం. వాస్తవంగా సినిమా నటుల ప్రేమలు పెళ్లిళ్లు గురించి పరిశీలన చేస్తే ఈ విషయం బాగా అర్ధం అవుతుంది. ప్రస్తుతం సెలెబ్రెటీలంతా ఎవరో ఒక ఫారినర్ తో చెట్టపట్టాలు వేసుకుని తిరగడం, ఆ వ్యవహారం మీడియాలో బాగా పాపులర్ అవ్వడం, అప్పుడు మేము డీప్ లవ్ లో ఉన్నాం. ప్రస్తుతానికి డేటింగ్ చేస్తున్నాం అంటూ చాలా చక్కగా సమాధానాలు ఇస్తూ ఉంటారు.

ఇక గబ్బర్ సింగ్ హీరోయిన్ శృతిహాసన్ కూడా ఈ విధంగానే మైఖేల్‌ కోర్సలే అనే లండన్ కుర్రాడి ప్రేమలో మునిగిపోయింది. వీరిద్దరూ చెట్టా పట్టాలేసుకుని తిరగడం, ఒకరి బర్త్‌డేను మరొకరు గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకోవడం, సెల్ఫీలతో సోషల్‌ మీడియాలో హడావుడి చేయడం షరామామూలుగా జరిగిపోయాయి. ఇలా చాలాసార్లు చాలా రకాలుగా చాలామంది దృష్టిలో పడ్డారు. వీరి ప్రేమకు శ్రుతీ తండ్రి కమల్‌ కూడా ఒకే చెప్పేసారు. ఇంకేముంది బాజా బజంత్రీలు మోగడమే తరువాయి అనుకుంటున్న సమయంలో ఈ ప్రేమ వ్యవహాంరంలో చిన్న ట్విస్ట్ బయటపడింది.

అది ఏంటి అంటే శ్రుతీ, మైఖేల్‌ విడిపోతున్నారు . ఇది ఎవరో కల్పించిన వార్తలు కాదు. స్వయంగా సృస్తి ప్రియుడు మైఖేలే స్వయంగా తన సోషల్‌ మీడియా ద్వారా బ్రేకప్‌ సందేశాన్ని పంపించాడు. ‘‘జీవితం మమ్మల్ని (శ్రుతీ–మైఖేల్‌) అనుకోకుండా భూమికి చెరో వైపు (తాను లండన్, శ్రుతి ఇండియన్‌ అనే అర్థంతో) ఉంచింది. బహుశా అందుకే మేము ఇద్దరం విడివిడిగా నడవాలి. కానీ మేము విడిపోయినప్పటికీ శ్రుతీహాసన్‌ నా బెస్ట్‌ ఫ్రెండ్‌లానే ఉంటుంది. తను నా ఫ్రెండ్‌గా దొరకడం నా అదృష్టం’’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు.

sruthi maikel

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news