Gossipsపబ్లిక్ గా రొమాన్స్ లో మునిగిపోయిన స్టార్ హీరోయిన్..

పబ్లిక్ గా రొమాన్స్ లో మునిగిపోయిన స్టార్ హీరోయిన్..

బహిరంగంగా ఇప్పుడు లిప్ కిస్ లు పెట్టుకోవడం… వాటిని సోషల్ మీడియా ఖాతాల్లో పెట్టి సంచలనం రేపడం ఇవన్నీ ఇప్పుడు కామన్ అయిపొయింది. దాదాపు సెలబ్రేటీలు అంతా ఇదే బాటపట్టారు. పండుగ కానీ… మరేదైనా కానీ సినీ స్టార్స్ అంతా దాదాపు ఇదే ట్రెండ్ ఫాలో అయిపోతూ.. హీట్ పెంచేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం దీపావళి రోజు షాహిద్ కపూర్ తన భార్యని ముద్దుపెడుతున్న ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సంచలనం సృష్టించాడు.
amy-jackson_710x400xt
ఆ ఫోటో సోషల్ మీడియాలో రాగానే… పెద్ద సంచలనమే అయ్యింది. దీపావళి శుభాకాంక్షలు మరీ ఇంతగా … చెప్పాలా అంటూ అనేక విమర్శలు చెలరేగాయి.
హీరోయిన్ దిశాపటాని దీపావళితో పాటు ఇటీవల జరిగిన క్రిస్మస్ రోజు కూడా తను బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోన్న ఓ ఇన్నర్ కంపనీ లో దుస్తులు ధరించి పండగ విషెస్ చెప్పడం కూడా దాదాపు ఇదే విధంగా సంచలనం సృష్టించింది. వీరంతా ఈ విధంగా విషెస్ చెప్తూ ఉంటే… నేనేమైనా తక్కువ తిన్నానా అంటూ…ఆ జాబితాలో చేరిపోయింది అమీజాక్సన్.

తన బాయ్ ఫ్రెండ్ ని ముద్దు పెడుతూ దిగిన ఫోటోని పోస్ట్ చేసి క్రిస్మస్ విషెస్ చెప్పింది. మల్టీ మిలియనీర్ రియల్ ఎస్టేట్ కింగ్ అయిన జార్జి పనాయట్టుతో కలిసి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్న ఎమీజాక్సన్ ఇలా ఘాటైన లిప్ కిస్ తో అభిమానులకు విషెస్ చెప్పింది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా ఒక్కో సెలెబ్రెటీ ఈ విధంగా… సోషల్ మీడియా ఖాతాల్లో రెచ్చిపోతుండడం చూస్తుంటే ముందు ముందు ఇంకెంత హాట్ హాట్ విషెస్ చుడాల్సి వస్తుందో చూడాలి.
3 Attachments

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news