మనం అంతే. అభిమానిస్తే ప్రాణాలైనా ఇస్తాం. “మాకోసం ప్రాణాలు తీసుకోవద్దు, అభిమానం హద్దులు దాటొద్దని” అభిమాన నటులు చెప్పినా మనం వినం. అదే పిచ్చి అభిమానం తిరుపతికి చెందిన పవన్ కళ్యాన్ అభిమానం ప్రానం తీసింది.
వినోద్ రాయల్. తిరుపతి ఎస్టీవీ నగర్ లో ఉంటాడు. పవన్ అంటే పిచ్చి అభిమానం. పవన్ అభిమాన సంఘం పేరుతో చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. జనసేనలో కూడా చురుగ్గా ఉండేవాడు. ఇందులో భాగంగానే ఈనెల 21న కర్నాటక సరిహద్దు ప్రాంతం కోలారులో జరిగిన అవయువ దానం కార్యక్రమానికి తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. ఇక్కడే ఇతర హీరో అభిమాని సునీల్ తో గొడవైంది. అది అప్పటికి సద్దుమణిగింది.
కార్యక్రమానికి హీరో సుమన్ కూడా అటెండయ్యారు. ఆయన్ని బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో దించిన వినోద్.. మళ్లీ కోలారు వచ్చాడు. అప్పటికే వినోద్ పై కోపంగా ఉన్న సునీల్ తన స్నేహితుడు అక్షయ్ తో కలిసి బార్ కు తీసుకెళ్లాడు. అక్కడ మళ్లీ మాట మాట పెరిగింది. దీంతో కోపంతో ఊగిపోయిన అక్షయ్ కత్తితో వినోద్ పై దాడి చేశాడు. కత్తి గుండెలో దిగడంతో.. వినోద్ స్పాట్ లోనే చనిపోయాడు. పోస్ట్ మార్టం తర్వాత వినోద్ డెడ్ బాడీని తిరుపతి తీసుకెల్లారు.
వినోద్ మరణంతో అతని కుటుంబం కన్నీరు మున్నీరైంది. చెతికొచ్చిన కొడుకు విగతజీవిలా తిరిగిరావడం వాళ్లు తట్టుకోలేకపోతున్నారు. అటు పవన్ కళ్యాన్ కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు తిరుపతి వెళ్లారు.