Moviesవిజయ్ ఆంటోని " రోషగాడు " రివ్యూ & రేటింగ్

విజయ్ ఆంటోని ” రోషగాడు ” రివ్యూ & రేటింగ్

బిచ్చగాడు సినిమాతో తెలుగులో ఓ సంచలనం సృష్టించిన విజయ్ ఆంటోని ఆ తర్వాత తమిళంలో తాను ఏ సినిమా చేసినా తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ ఆంటోని నటించిన తిమిరు పుదిచవన్ సినిమా తెలుగులో రోషగాడు అంటూ రిలీజ్ చేశారు. మరి సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

సిన్సియర్ కానిస్టేబుల్ అయిన కుమార స్వామి (విజయ్ ఆంటోని) తన తమ్ముడు రవినిని కూడా పోలీస్ ఆఫీసర్ ను చేయాలని అనుకుంటాడు. అయితే అతను మాత్రం ఊరు నుండి పారిపోయి హైదరాబాద్ చేరుకుంటాడు. రెండేళ్ల తర్వాత కుమార స్వామికి హైదరాబాద్ ట్రాన్స్ ఫర్ అవుతుంది. అక్కడ రవి బాబ్జి దగ్గర చేరి హత్యలు చేస్తున్నాడని గమనిస్తాడు. తమ్ముడైనా సరే రవి చేసే అరాచకాలను చూసిన కుమార స్వామి రవిని ఎన్ కౌంటర్ చేస్తాడు. తన తమ్ముడిలానే కొంతమంది పిల్లలు బాబ్జి కోసం పనిచేస్తున్నారని గమనించిన కుమారస్వామిని వారిని ఎలా మార్చాడు అన్నది సినిమా కథ.

నటీనటుల ప్రతిభ :

విజయ్ ఆంటోని నటన సినిమాకు హైలెట్ గా నిలిచిందని చెప్పొచ్చు. ఎమోషనల్, యాక్షన్ సీన్స్ లో విజయ్ అలరించాడు. హీరోయిన్ నివేదా పేతురాజ్ కూడా తన నటనతో మెప్పించింది. డానియల్ బాలాజి విలన్ పాత్రలో బాగా నటించాడు. ఇక మిగతా పాత్రదారులంగా బాగానే చేశారు.

సాంకేతికవర్గం పనితీరు :

రిచర్డ్ నాథన్ సినిమాటోగ్రఫీ బాగుంది. విజయ్ ఆంటోని మ్యూజిక్ సినిమాకు అంతగా మ్యాచ్ అవలేదు. బిజిఎం ఓకే కేవలం 3 సాంగ్స్ మాత్రమే ఉన్నాయి. అవి కూడా మాములుగా ఉన్నాయి. దర్శకుడు గణేషా రాసుకున్న కథ బాగానే ఉన్నా కథనం చాలా ల్యాగ్ చేశాడనిపిస్తుంది. స్లో నరేషన్ సినిమాకు పెద్ద మైనస్. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

విశ్లేషణ :

బిచ్చగాడు వచ్చింది కదా అన్నిసార్లు అదే మ్యాజిక్ వర్క్ అవుట్ అవుతుంది అనుకుంటే పొరబడినట్టే. విజయ్ ఆంటొని తను నటిస్తున్న ప్రతి సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు. అలానే రోషగాడు కూడా వచ్చింది. అయితే సినిమాకు ఏమాత్రం బజ్ లేకపోగా సినిమా కూడా సాగదీతగా ఉందని అంటున్నారు.

ఇక సినిమా అంతా తమిళ నేటివిటీకి దగ్గరగా ఉండటం కూడా ఓ మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. విజయ్ ఆంటొని ఇదవరకు సినిమాల్లా ఈ సినిమా మీద అంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోయాడు. స్టోరీ లైన్ ఎమోషనల్ గా బాగున్నా తెలుగులో ఇలాంటివి వర్క్ అవుట్ అవ్వవని చెప్పొచ్చు.

ఫస్ట్ హాఫ్ సాగదీతగా అనిపించగా సెకండ్ హాఫ్ కూడా అలానే స్లో నరేషన్ తో ఆడియెన్స్ పేషెన్స్ కు టెస్ట్ పెడుతుంది రోషగాడు. మొత్తానికి విజయ్ ఆంటొనికి మరో ఫెయిల్యూర్ ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్ :

విజయ్

సినిమాటోగ్రఫీ

మెయిన్ ప్లాట్

మైనస్ పాయింట్స్ :

తమిళ నేటివిటీ

స్లో నరేషన్

స్క్రీన్ ప్లే

బాటం లైన్ :

రోషగాడు.. విజయ్ ఆంటోని మరో విఫల ప్రయత్నం..!

రేటింగ్ : 2.25/5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news