రామ్ గోపాల్ వర్మ. పేరు వింటేనే ఏదో వివాదస్పద విషయం గుర్తుకొస్తుంది. ఎప్పుడు తన ట్వీట్లతో వివాదం లేపడం ఆయనకలవాటే. ఈ మద్యనే చిరంజీవి 150వ సినిమా విషయంలో మూతి కాల్చుకుని చివరకు సారీ చెప్పాడు. ఇలా చాలానే ఆయనగారి ఖాతాలో ఉంటాయి. నయీం విషయంలో సినిమా తీస్తానంటూ ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు.
అయితే అలవాటు ప్రకారం ఈ మద్య ఓ ట్వీట్ చేశాడు. ఒలింపిక్స్ లో ఒక్క సిల్వర్ కే అంత ఉప్పొంగిపోతే.. 46గోల్డ్, 37సిల్వర్ గెలుచుకున్న అమెరికా తన గురించి ఏం చెప్పుకోవాలి.. జస్ట్ ఆస్కింగ్ అంటూ ఓ ట్వీట్ చేశాడు.
డైరక్టర్లకే అంత టాలెంట్ ఉంటే.. వాళ్ల సినిమాలను చూసే అభిమానులకెంత ఉండాలి. అందుకే శ్రీవిఘ్నేష్ అనే వ్యక్తి వర్మకు రీట్వీట్ తో ఝలక్ ఇచ్చాడు. ఒకట్రెండు సినిమాలు హిట్ కొట్టిన నువ్వే డైరక్టర్ అని పిలుచుకుంటే..రాజమౌళి, శంకర్, బాలా లాంటివాళ్లనేమనాలి.. జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్వీట్ చేశాడు. ఇప్పుడిది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.