బాహుబలి సిరీస్ తరవాత ప్రభాస్ మార్కెట్ అమాంతంగా పెరింగిందన్నది వాస్తవం . అయితే ఇక నుండి తీసే సినిమాలన్నీ బాహుబలి రేంజ్ లోనే ఉండాలి అనుకుంటున్నాడట ప్రభాస్ . అంటే ఆ రేంజ్ బడ్జెట్ , రిచ్ నెస్ వుండాలనుకుంటున్నాడట . బాలీవుడ్ లో ని స్టార్ హీరోలంతా తమ హై బడ్జెట్ ఫ్రాంచైజ్ చిత్రాలను చేస్తూనే మధ్యలో రెగ్యులర్ బడ్జెట్ సినిమాల్లోనూ నటిస్తూవుంటారు . కానీ ప్రభాస్ వారికి భిన్నంగా కనిపిస్తున్నాడు .
ఉదాహరణకి సాహో చిత్రం బడ్జెట్ తీసుకుంటే 150 కోట్ల పై మాటే . కేవలం రెండు రెగ్యులర్ కమర్షియల్ సినిమాల అనుభవం వున్నా సుజిత్ అంత భారీ కాన్సెప్టులతో భారీ బడ్జెట్ సినిమాను హ్యాండిల్ చేయగలడా అనే సందేహం రాక మానదు . ఇక లేటెస్ట్ గా జిల్ దర్శకుడు రాధా కృష్ణ కుమార్ పరిస్థితి ఇదే విధంగా మారింది, నిజానికి రాధా కృష్ణ ప్రభాస్ తో ఒక కమెర్షియల్ సినిమా ప్లాన్ చేసాడట, అయితే ప్రభాస్ మాత్రం బడ్జెట్ విషయం లో కాంప్రమైస్ అవ్వటం లేదని వినికిడి .ఇదే కంటిన్యూ అయితే ఆ దర్శకుల అనుభవలేమి ఈ భారీ బడ్జెట్ సినిమాలకి ఆటంకంగా మారితే ప్రొడ్యూసర్ చిక్కుల్లో పడ్డట్టే.
డైరెక్టర్లకి చుక్కలు చూపిస్తున్న ప్రభాస్..!
మరిన్ని వార్తల కోసం తెలుగు లైవ్స్ వాట్సాప్ లో ఫాలో అవ్వండి