టాలీవుడ్ లో ఇద్దరు స్టార్ హీరోల స్నేహం మరింత బలపడుతుంది. సినిమాల పరంగా ఫైట్ ఎలా ఉన్నా వారిద్దరు ఈమధ్య బాగా కలుస్తున్నారు. రికార్డులు తిరగరాసే సత్తా ఉన్న ఆ ఇద్దరు స్టార్ హీరోలు తమ లానే తమ ఫ్యాన్స్ కూడా కలిసి మెలిసి ఉండాలని సూచిస్తున్నారు. ఇంతకీ ఎవరా ఇద్దరు అంటే ఇంకెవరు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ అని తెలుస్తుంది.
వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న ఈ ఇద్దరు స్టార్స్ ఈమధ్య చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఎన్.టి.ఆర్, చరణ్ ఎక్కడ చూసిన వీరి హంగామానే కనిపిస్తుంది. రాజమౌళి సినిమాలో కలిసి నటిస్తున్న ఈ ఇద్దరు మధ్య సాన్నిహిత్యం ఇండస్ట్రీకి చాలా మంచింది. ఈమధ్యనే రెండో సారి తండ్రైన తారక్ చిన్న కొడుకుని చూసేందుకు చరణ్ వెళ్లాడట.
ఇప్పుడు చరణ్ ఆ బుడతడితో దిగిన పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ఎన్.టి.ఆర్ చరణ్ ఎప్పుడూ ఇలానే మంచి స్నేహభావంతో ఉండాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
https://youtu.be/Epqy-FyXpng