ఈరోజు తెల్లవారుఝామున జరిగిన రోడ్ యాక్సిడెంట్ లో నందమూరి హరికృష్ణ దుర్మరణం చెందారు. ఉదయం 4:30 నిమిషాల టైం లో ఈ దుర్ఘటన జరిగినట్టు తెలుస్తుంది. హైదరాబాద్ నుండి నెల్లూరు వెళ్తున్న హరికృష్ణ కారు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కన పల్టీలు కొట్టింది. హరికృష్ణ తానే స్వయంగా కారు డ్రైవ్ చేస్తున్నట్టు సమాచారం.
హరికృష్ణ మరణ వార్త నందమూరి ఫ్యామిలీలో ప్రకంపణలు వచ్చేలా చేసింది. వరుసగా నందమూరి వారికే ఇలా ఎందుకు జరుగుతున్నట్టో అర్ధం కావడం లేదు. ఇక అన్న మరణ వార్త విని నిర్గాంతపోయిన బాలకృష్ణ విషయం తెలుసుకుని కన్నీరు మున్నీరు అయ్యాడట. పైకి ఒకరితో ఒకరు మాట్లాడకున్నా ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కలుసుకుంటూనే ఉన్నారు.
ఇక హరికృష్ణ మరణం బాలకృష్ణకు షాక్ ఇచ్చిందని చెప్పాలి. టిడిపి తనకు ఏమంత ప్రాముఖ్యత ఇవ్వట్లేదని చెప్పి పార్టీ కార్యచరణలకు దూరంగా ఉంటూ వస్తున్నారు హరికృష్ణ. కొన్నాళ్లుగా బాలకృష్ణతో ఎడమొహం పెడ మొహం గా ఉంటున్నారన్నది వాస్తవం. కాని అన్న మరణ వార్త విన్న బాలకృష్ణ పనులన్ని వదిలిపెట్టి చివరి చూపులు చూసేందుకు వస్తున్నట్టు తెలుస్తుంది.