అన్నా చెల్లెళ్లు.. అక్కా తమ్ముళ్ల అనుబంధాన్ని చెప్పే పండుగ రాఖి పౌర్ణిమ. రక్షా బంధన్ అని కూడా అంటారు. అన్నకు రాఖి కట్టి అతనితో కలకాలం ఇలాంటి బంధాన్ని కొనసాగించాలనే ఉద్దేశమే రక్ష బంధన్ ముఖ్య ఉద్దేశ్యం. అంతేకాదు రాఖి కట్టిన ఆడపడుచు, కట్టించుకున్న సోదరుడు ఇద్దరు ఆయురారోగ్యాలతో ఉండేలా దీవించుకుంటారు.
అయితే రేపు అనగా ఆగష్టు 26 ఆదివరం ఏయే సమయాల్లో రాఖీ కట్టాలి అంటే వేద పండితులు సూచించిన దాని ప్రకారంగా రాఖీ రేపు ఉదయం 7: 45 గంటల నుండి 12:28 నిమిషాల వరకు కట్టొచ్చు. ఇక ఆ తర్వాత మధ్యాహ్నం 2:03 నిమిషాల నుండి 3:38 నిమిషాల వరకు కట్టొచ్చు. ఈ సమయాల్లో తప్పితే రేపు రాఖీ కట్టకూడదా అంటే ప్రత్యేకించి ఈ సమయాల్లో కడితే మంచి జరుగుతుందని అంటున్నారు.