మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా వస్తున్న సైరా నరసింహా రెడ్డి టీజర్ మంగళవారం నాడు రిలీజ్ అయ్యి సంచలనంగా మారింది. ఈ టీజర్ గంటలోనే మిలియన్ వ్యూస్ సాధించగా ఒక్క రోజులో 7 మిలియన్స్ వ్యూస్ తెచ్చుకుంది. ఇక అతి తక్కువ టైంలో కోటి వ్యూస్ తో సైరా రికార్డ్ సృష్టించింది.
12 మిలియన్ వ్యూస్ తో సైరా టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఈ వ్యూ కౌంట్ నిజమా కాదా అన్న డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే యూట్యూబ్ లో ఈ రేంజ్ హంగామా చేయాలంటే కచ్చితంగా టాప్ ట్రెండింగ్ లో ఉండాలి. మరి అలాంటిదేమి లేకుండా అలా కోటి వ్యూస్ ఎలా సాధిస్తుందని టాక్.
మరోపక్క ఈమధ్య వచ్చిన అరవింద సమేతకు ఇన్ని వ్యూస్ రాకున్నా యూట్యూబ్ ట్రెండింగ్ లో వచ్చింది. మరి ఏవి సరైన వ్యూస్.. ఏది ఫేక్ వ్యూస్ అన్నది తెలియాల్సి ఉంది. వ్యూయర్ కౌంట్ ఎలా ఉన్నా సైరాతో మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన స్టామినా ప్రూవ్ చేసేందుకు వస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా వస్తున్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.