నితిన్, రాశి ఖన్నా జంటగా శతమానం భవతి డైరక్టర్ సతీష్ వేగేశ్న డైరక్షన్ లో వచ్చిన సినిమా శ్రీనివాస కళ్యాణం. దిల్ రాజు నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.
కథ :
చండిఘర్ లో డిజైనర్ గా పనిచేస్తున్న వాసు (నితిన్), తెలుగు వాళ్లతో కలిసి ఉంటాడు.. కొత్తగా పక్కింట్లోకి దిగిన హీరోయిన్ ను చూసి ఇష్టపడతాడు. ఆమె కూడా కుటుంబం దాని విలువల గురించి వాసుకి ఉన్న అండర్ స్టాండింగ్ తో అతనికి దగ్గరవుతుంది. బిలీనియర్ ఆర్కే (ప్రకాశ్ రాజ్) కూతురు అయిన హీరోయిన్ వాసుతో పెళ్లికి తండ్రిని ఒప్పిస్తుంది. ఇద్దరి పెళ్లి ఎలా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో కుటుంబసభ్యులు ఎవరెవరు ఎలా పాల్గొన్నారు అన్నది సినిమా కథ.
నటీనటుల ప్రతిభ :
వాసు పాత్రలో నితిన్ చాలా చక్కగా ఒదిగిపోయాడు. చాలారోజుల తర్వాత నితిన్ లో ఎనర్జీ కనబడింది. ఇక రాశి ఖన్నా పాత్ర బాగుంది. ఆమె కూడా బాగా చేసింది. ఈ సినిమాలో చిన్న పాత్రకు కూడా భారీ స్టార్ట్ కాస్టింగ్ తీసుకున్నారు. ప్రతి పాత్ర సినిమాలో చాలా బాగుంటుంది. జయసుధ, ప్రకాశ్ రాజ్, నరేష్ ఇలా అందరు తమ తమ పాత్రల్లో అలరించారు.
సాంకేతికవర్గం పనితీరు :
సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కళ్యాణం మహోత్సవం కన్నుల విందుగా ఉండేలా ఆయన కెమెరా వర్క్ ఉంది. సినిమా అంతా చాలా చక్కగా హృద్యంగా తీశారు. సినిమాకు మిక్కి జే మేయర్ మ్యూజిక్ మరో అద్భుతం. కళ్యాణం సాంగ్ ఒక్కటి చాలు సినిమా రేంజ్ ఏంటన్నది. మిక్కి మ్యూజిక్ సినిమాకు ప్ర్ధాన ఆకర్షణగా అవుతుంది. ఇక సతీష్ వేగేశ్న కథ, కథనాలు మరోసారి కుటుంబ విలువల గురించి చెప్పారు. దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.
విశ్లేషణ :
యూత్ ఆడియెన్స్ కు నచ్చేలా సినిమా చేస్తే చాలు మిగతా వారు చూసినా చూడకున్నా మనకేంటి అనుకునే దర్శక నిర్మాతలు ఉన్న ఈరోజుల్లో కేవలం ఫ్యామిలీ ఆడియెన్స్ ను బేస్ చేసుకుని సినిమా తీయడం అంటే మాములు విషయం కాదు. అలాంటి కోవకు చెందిన సినిమానే శ్రీనివాస కళ్యాణం.
పక్కా ట్రెడిషనల్ వాల్యూస్ ఉన్న ఒక ఫ్యామిలీకి చెందిన ఒక అబ్బాయి దానికి పూర్తి వ్యతిరేకంగా ఉండే ఒక అమ్మాయిని ప్రేమించి ఆ రెండు ఫ్యామిలీలను ఒప్పించి పెళ్లి చేసుకోవడమే ఈ సినిమా కాన్సెప్ట్. సినిమా అంతా ఫ్యామిలీ ఎమోషన్స్ తో నిండిపోయింది. ఇంటర్వల్ సీన్, క్లైమాక్స్ సీన్స్ హైలెట్ అని చెప్పొచ్చు.
నితిన్, రాశి ఖన్నాల కెమిస్ట్రీ బాగుంది. ఎమోషనల్ సీన్స్ లో నితిన్ బాగా చేశాడు. క్లైమాక్స్ లో ఫ్యామిలీ ఆడియెన్స్ ను టచ్ చేశాడు. యూత్ ఆడియెన్స్ గురించి చెప్పలేం కాని కుటుంబమంతా చూసే మంచి సినిమాగా శ్రీనివాస కళ్యాణం గురించి చెప్పొచ్చు.
ప్లస్ పాయింట్ :
లీడ్ పెయిర్
ఫ్యామిలీ ఎమోషన్స్
మ్యూజిక్
మైనస్ పాయింట్స్ :
అక్కడక్కడ డోస్ పెరగడం
లెంగ్తీ డైలాగ్స్
బాటం లైన్ :
శ్రీనివాస కళ్యాణం.. ఫ్యామిలీ ఎంటర్టైనర్..!
రేటింగ్ : 3.25/5