కమల్ హాసన్ హీరోగా వస్తున్న విశ్వరూపం-2 ఈ నెల 10న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ కొద్ది గంటల క్రితం రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ కోసం కమల్ హైదరాబాద్ వచ్చారు. 2013లో విశ్వరూపం సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఆస్కార్ రవింద్రన్ నిర్మించారు. ఆ తర్వాత సీక్వల్ ప్రయత్నాలు చేయగా నిర్మాత ఆర్ధిక కష్టాలతో సినిమా ఆపేశారు.
అయితే కమల్ ప్రాజెక్ట్ మొత్తం తన చేతుల్లోకి తీసుకుని పోస్ట్ ప్రొడక్షన్ చేయించారు. ఇక రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. విశ్వరూపం సీక్వల్ గా ఈ పార్ట్ ప్రేక్షకులకు మరింత డీటైల్డ్ గా వివరించనున్నారట. ట్రైలర్ లో కమల్ తెగింపు కనబడుతుంది. సినిమా ట్రైలర్ మాత్రం బాగా కట్ చేశారు. గిబ్రన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో పూజా కుమార్, ఆండ్రియా హీరోయిన్స్ గా నటించారు.