Trade analysts released five days collections report of Mohanlal latest starrer “Manyam Puli” movie. According to the report, this movie is doing decent collections at the box office of both Telugu States.
ఈనెల 2వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘మన్యంపులి’ చిత్రం అంచనాలకు తగ్గట్లు మంచి కలెక్షన్లతో దూసుకెళుతోంది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఫస్ట్ వీకెండ్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.1.50 కోట్లు షేర్ రాబట్టిన ఈ చిత్రం.. ఆ తర్వాత రెండు వర్కింగ్ డేస్‌లలో రూ.60 లక్షలు కలెక్ట్ చేసింది. అంటే.. మొత్తం ఐదురోజుల్లో ఈ డబ్బింగ్ సినిమా రూ.2.1 కోట్లు షేర్ వసూలు చేసింది.
సాధారణంగా డబ్బింగ్ చిత్రాలు ఫస్ట్ వీకెండ్ వరకే ఓ రేంజులో కలెక్షన్లు రాబడుతాయి. వీక్ డేస్‌లో మొత్తం అంతంత మాత్రమే. అయితే.. మన్యంపులి డీసెంట్ వసూళ్లు రాబట్టడం నిజంగా విశేషమని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. ఆల్రెడీ మలయాళంలో చరిత్ర సృష్టించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదల కావడం, రిలీజ్ రోజు హిట్ టాక్ రావడంతో.. ఇలా కలెక్షన్లు వసూలు చేస్తోందని చెబుతున్నారు. ఈ మూవీ దూకుడు చూస్తుంటే.. టోటల్ రన్లో రూ.4-5 కోట్ల మధ్య కలెక్షన్స్ కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.
మోహన్‌లాల్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని సరస్వతి ఫిల్మ్స్‌వారు తెలుగులో డబ్ చేసి, రిలీజ్ చేశారు. ఇందులో కమిలిని ముఖర్జీ కథానాయికగా నటించగా.. జగపతిబాబు విలన్ పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు వైశాఖ్ తెరకెక్కించాడు.
ఏరియాలవారీగా 5 రోజుల కలెక్షన్స్ (లక్షల్లో) :
నైజాం : 90
సీడెడ్ : 26
ఉత్తరాంధ్ర : 23
ఈస్ట్ గోదావరి : 15
వెస్ట్ గోదావరి : 13
గుంటూరు : 18
కృష్ణా : 18
నెల్లూరు : 7
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ. 2.10 కోట్లు (షేర్)