Movies" హ్యాపీ వెడ్డింగ్ " రివ్యూ & రేటింగ్

” హ్యాపీ వెడ్డింగ్ ” రివ్యూ & రేటింగ్

మెగా డాటర్ నిహారిక సెకండ్ మూవీగా వస్తున్న సినిమా హ్యాపీ వెడ్డింగ్. సుమంత్ అశ్విన్ హీరోగా నటించిన ఈ సినిమాను లక్ష్మణ్ కార్య డైరెక్ట్ చేశాడు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో పాకెట్ సినిమా నిర్మించిన ఈ మూవీలో మురళి శర్మ, నరేష్ లాంటి సీనియర్ ఆర్టిస్టులు నటించారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

ఆనంద్ (సుమంత్), అక్షర (నిహారిక )ప్రేమించుకుని పెళ్లికి సిద్ధమవుతారు. అయితే నిహారిక చేస్తున్న ఆఫీస్ లో విజయ్ ఆమెను ప్రేమిస్తాడు. అతన్ని కాదని అక్షర, ఆనంద్ తో పెళ్లి ఫిక్స్ చేసుకుంటుంది. అయితే ఆ విషయం తెలుసుకున్న ఆనంద్ అక్షరతో గొడవ పడతాడు. అక్షర తన కన్ ఫ్యూజన్ తో ప్రతిసారి ఆనంద్ పై తన మాట గెలిచేలా చేసుకుంటుంది. ఎంగేజ్మెంట్ తర్వాత ఇద్దరు గొడవ పడతారు. ఆ క్రమంలో అసలు వీరికి పెళ్లి అవుతుందా కాదా అన్నట్టుగా విడిపోతారు. ఫైనల్ గా మళ్లీ ఎలా కలిశారు అన్నది సినిమా కథ.

నటీనటుల ప్రతిభ :

సుమంత్ అశ్విన్ హీరోగా మునుపటి కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. హీరోగా అతనికి మంచి లిఫ్ట్ ఇచ్చినట్టే. ఇక మెగా డాటర్ నిహారిక మరోసారి తన యాక్టింగ్ టాలెంట్ తో మెప్పించింది. సినిమాలో ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగా చేసింది. కన్ ఫ్యూజ్ క్యారక్టర్ లో ఆకతాయితనంతో ఆకట్టుకుంది. ఒక మనసు కన్నా ఈ సినిమా నిహారికకు మంచి పేరు తెచ్చి పెడుతుంది. మురళి శర్మ, నరేష్ పాత్రలు సరదాగా ఉంటాయి. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.

సాంకేతిక వర్గం పనితీరు :

బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. తమన్ మ్యూజిక్ ఇంప్రెస్ చేసింది. దర్శకుడు లక్ష్మణ్ కార్య ఎంచుకున్న పాయింట్ ను చక్కగా తెరకెక్కించాడు. కథ అంత గొప్పగా లేకున్నా కథనం గ్రిప్పింగ్ గా రాసుకున్నాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్ గా ఉన్నాయి.

విశ్లేషణ :

ఆల్రెడీ ఎంగేజ్ మెంట్ అయిన జంట మధ్య జరిగే గొడవ నేపథ్యమే హ్యాపీ వెడ్డింగ్ సినిమా.. ముఖ్యంగా సినిమాలో హీరోయిన్ పాత్రకు ఎక్కువ స్కోప్ దొరికిందని చెప్పొచ్చు. సినిమా మొదటి భాగం సరదాగా సాగినట్టు అనిపించగా సెకండ్ హాఫ్ కాస్త ఎమోషనల్ డ్రామాగా అనిపిస్తుంది.

ఇక పంచ్ డైలాగ్స్ ల ట్రెండ్ కొనసాగుతున్న ఈ రోజుల్లో పేజీల కొద్ది డైలాగ్స్ రాసాడు దర్శకుడు. అయితే ఎమోషనల్ వర్క్ అవుట్ అవడంతో పర్వాలేదు అనిపించుకున్నాయి. సుమంత్, నిహారిక పెయిర్ బాగుంది. సినిమాలో ఎక్కువ మార్కులు నిహారికకే పడ్డాయని చెప్పొచ్చు.

ఒక మనసు పొయెటిక్ వేలో ప్రేమ గురించి చెప్పగా ఈకాలపు అమ్మయిల మనసులోని ఆలోచనలు ఎలా ఉంటాయన్నది ఈ సినిమాలో తన అభినయం ద్వారా చూపించింది నిహారిక. యువత మెప్పు పొందే సినిమాగా హ్యాపీ వెడ్డింగ్ మంచి టాక్ సొంతం చేసుకోవడం ఖాయం.

ప్లస్ పాయింట్స్ :

లీడ్ పెయిర్

క్లీన్ ఎంటర్టైనర్

ఎమోషనల్ సీన్స్

మైనస్ పాయింట్స్ :

అక్కడక్కడ డ్రమెటిక్ గా అనిపించడం

బాటం లైన్ :

నిహారిక హ్యాపీ వెడ్డింగ్.. మెప్పించేసింది..!

రేటింగ్ : 3/5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news