మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన భారీ పాన్ ఇండియా సినిమా కన్నప్ప. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, మళయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, కాజల్ అగర్వాల్, బాలీవుడ్ సీనియర్ హీరో అక్షయ్ కుమార్ లాంటి భారీ తారాగణంతో తెరకెక్కిన సినిమా ఇది. రు. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో మంచు మోహన్ బాబు నిర్మాణ సారథ్యంలో ఈ సినిమాను నిర్మించారు. ఇక జిన్నా తర్వాత విష్ణు చేసిన సినిమా ఇది.దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం, మంచు విష్ణు కథ, కథనాలతో వచ్చిన ఈ సినిమా విష్ణు కెరీర్‌లోనే భారీ హిట్ సినిమాగా దూసుకు వెళుతోంది. ఈ సినిమా విష్ణు కెరీర్ లోనే రికార్డు ఓపెనింగ్స్ అందుకున్నట్టుగా ట్రేడ్ రిపోర్టులు చెపుతున్నాయి. విష్ణు పీఆర్ లెక్కల ప్రకారం కన్నప్ప సినిమా డే 1 కి గాను ఏకంగా 20 కోట్ల ఓపెనింగ్స్ ని వరల్డ్ వైడ్ గా కొట్టినట్టు తెలుస్తుంది.
ఇది మంచు విష్ణు కెరీర్‌లోనే ఆల్ టైం హయ్యస్ట్ రికార్డ్‌గా నిలిచింది. పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ తారాగణంతో తెరకెక్కించిన ఈ సినిమా అందరు ఫ్యాన్స్ అంచనాలు రీచ్ అవ్వడం విశేషం. ఇక శని, ఆదివారాలు కూడా మంచి బుకింగ్స్ నమోదు అవుతుండడంతో కన్నప్ప వసూళ్లు ఫస్ట్ వీకెండ్‌లో భారీగా ఉండనున్నాయి.
‘ కన్నప్ప ‘ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్లు …. వావ్ కేక…!
