Moviesప‌వ‌న్ OG ఆంధ్రాలో సెన్షేష‌న‌ల్ బిజినెస్‌... ఆ టాప్ నిర్మాత అన్ని...

ప‌వ‌న్ OG ఆంధ్రాలో సెన్షేష‌న‌ల్ బిజినెస్‌… ఆ టాప్ నిర్మాత అన్ని కోట్లు పెట్టాడా..?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రేంజ్‌కు త‌గ్గ సినిమా వ‌స్తుంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్పుడు ప‌వ‌న్ ఓసీ సిసిమా మీద ఆకాశాన్నంటే స్థాయిలో అంచ‌నాలు ఉన్నాయి. ప‌వ‌న్ కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ రేంజ్ క్రేజ్ ఓసీ సినిమా మీద ఉంది. ప‌వ‌న్ గ్యాంగ్‌స్ట‌ర్ లీడ‌ర్‌గా న‌టిస్తుండ‌డం.. ఇటు ఏపీలో అధికారంలో ఉన్న కూట‌మి ప్ర‌భుత్వంలో ఉప ముఖ్య‌మంత్రిగా ఉండ‌డంతో ఓజీకి ఆంధ్రాలో దుమ్ము రేపు బిజినెస్ న‌డుస్తోంది.Gangster drama film 'OG', starring Pawan Kalyan, set to hit big screen on  Sep 27సీడెడ్ కాకుండా.. మిగిలిన ఆంధ్రా ఏరియా ఓజీ రైట్స్‌ను ఓ టాలీవుడ్ అగ్ర నిర్మాత రు. 80 కోట్ల‌కు సొంతం చేసుకున్న‌ట్టు ట్రేడ్ వ‌ర్గాల్లో టాక్ న‌డుస్తోంది. దీంతో అసలు ఓజి క్రేజ్ ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రియాంక అరుల్ మోహ‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ సెప్టెంబర్ 25న గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

Latest news