నందమూరి నటసింహం బాలకృష్ణతో సాలిడ్ ట్రాక్ రికార్డు ఉన్న మాస్ దర్శకుల్లో ఒకప్పుడు బి గోపాల్ ఉంటే ఈ తరంలో మాత్రం బోయపాటి శ్రీను మాత్రమే ఉంటారు. వీరి కాంబోలో వచ్చిన సింహా – లెజెండ్ – అఖండ మూడు సినిమాలు ఒకదానిని మించి మరొకటి హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు వీరి కాంబోలో వస్తోన్న నాలుగో సినిమా అఖండ 2 – తాండవం సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
తాజాగా బాలయ్య పుట్టిన రోజు కానుకగా ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ఇపుడు చర్చగా మారింది. మామూలుగానే బోయపాటి అంటేనే మాస్ .. ఊరమాస్. బోయపాటి సినిమాలలో లాజిక్స్ వెతకకుండా జస్ట్ మాస్ మూమెంట్స్ ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు అఖండ 2 విషయంలోనూ అదే జరగబోతోందని క్లారిటీ వచ్చేసింది.
తాజాగా వచ్చిన అఖండ 2 తాండవం టీజర్ లో ఒకటీ రెండు షాట్స్ మీద కూడా బోయపాటి లాజిక్ మిస్ అయినా షాట్స్ మాస్ తాండవం చేసేశాయంటున్నారు. ఓవరాల్గా ఆడియెన్స్ సోషల్ మీడియాలో లాజిక్స్ మిస్ అయినా కూడా టీజర్ అదిరిపోయిందనే అంటున్నారు. ఎంజాయ్ చేస్తున్నారు.