Moviesఇక బాహుబ‌లి 1, బాహుబ‌లి 2 లేన‌ట్టే... ఒక్క‌టే బాహుబ‌లి... !

ఇక బాహుబ‌లి 1, బాహుబ‌లి 2 లేన‌ట్టే… ఒక్క‌టే బాహుబ‌లి… !

టాలీవుడ్ యంగ్ రెబ‌ల్ స్టాప్ ప్ర‌భాస్‌ను ఒక్క‌సారిగా ఇంట‌ర్నేష‌న‌ల్ స్టార్‌ను చేసిన సినిమా ఏదైనా ఉంది అంటే అది బాహుబ‌లి సీరిస్ సినిమాలే. బాహుబ‌లి 1, బాహుబ‌లి 2 సీరిస్ సినిమాల‌తో ప్ర‌భాస్ రేంజ్‌.. తెలుగు సినిమా క్రేజ్ ఎక్క‌డికో వెళ్లి పోయింది. ఇక పాన్ ఇండియా రేంజ్‌లో బాహుబ‌లి విధ్వంసం క్రియేట్ చేసింది. తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్ల‌లు దాటించేసిన బాహుబ‌లి 1, 2 రెండు సినిమాలు కూడా తెలుగు సినిమా అంటే పాన్ వ‌ర‌ల్డ్ అనేలా ఫ్రూవ్ చేశాయి.Baahubali The Conclusion (2017) | Baahubali The Conclusion Movie ...మరి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ … అలాగే దర్శకుడు రాజమౌళి ప్రాణం పెట్టి తీసిన ఈ సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ కి రాబోతున్నాయి. ఇప్ప‌టికే దీనిపై ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. బాహుబ‌లి 1ను అక్టోబ‌ర్‌లో రీ రిలీజ్ చేయాల‌ని ముందుగా అనుకున్నారు. అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా ఇప్పుడు మ‌రో అదిరిపోయే అప్‌డేట్ వ‌చ్చింది. మేక‌ర్స్ థియేట‌ర్ల‌లో అదిరిపోయే ట్రీట్ ఇవ్వ‌నున్నారు. ఏక‌కాలంలో పార్ట్ 1, పార్ట్ 2 రెండు క‌లిపి రిలీజ్ చేస్తార‌ట‌.Baahubali 2: The Conclusion - Wikipediaఇందులోనే ట్విస్ట్ ఏంటంటే బాహుబ‌లి 1, బాహుబ‌లి 2 రెండు సినిమాలను క‌లిపేసి ఒకే పార్ట్‌.. ఒకే సినిమాగా రీ రిలీజ్ చేస్తార‌ట‌. అంటే బాహుబ‌లి రెండు పార్టులు క‌లిపి ఒకే భాగంగా రానుంది. అందుకు తగ్గట్టుగా సినిమాని ట్రిమ్ చేసి ఒక్క సినిమా గానే మార్చి ఆ వెర్షన్ అక్టోబ‌ర్‌లో రిలీజ్ చేస్తార‌ట‌.

Latest news