టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘హరి హర వీరమల్లు’. మోఘలుల కాలం నాటి ఓ దోపిడి దొంగ చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఈ నెల 12న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక పవన్ కళ్యాణ్ ఈ వారం ఎండింగ్ నుంచి ప్రమోషన్లలో పాల్గొంటారు. రెగ్యులర్ ప్రమోషన్లలా కాకుండా సినిమా గురించి పవన్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూలు ప్లాన్ చేయిస్తున్నారు.రిలీజ్‌కు వారం రోజుల ముందు నుంచే దూకుడుగా ప్రమోషన్లు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ చాలా బిజీ.. అటు రాజకీయాల్లో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఇక డిస్ట్రిబ్యూషన్ విషయంలో కూడా పవన్ సితార, మైత్రీ వాళ్లతో కో ఆర్డిరేషన్ చేసుకుని నిర్మాత ఇబ్బంది పడకుండా ప్లాన్ చేశారు. ఏదేమైనా వీరమల్లు విషయంలో పవన్ ప్లానింగ్‌లు అన్నీ వర్కవుట్ అయ్యి హిట్ అయితే పవన్ ఫ్యాన్స్‌కు, తెలుగు సినీ లవర్స్‌కు అంతకన్నా కావాల్సింది ఏం ఉంటుంది.
వీరమల్లును సూపర్ హిట్ కోసం పవన్ ప్లాన్స్ చూశారా…!
