Moviesచిరు - అనిల్ రావిపూడి అప్పుడే ప్యాక‌ప్ చెప్పేశారా.. ఇంత స్పీడ్...

చిరు – అనిల్ రావిపూడి అప్పుడే ప్యాక‌ప్ చెప్పేశారా.. ఇంత స్పీడ్ ఏంది సామీ…!

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సినిమాపై ఏ స్థాయిలో అంచ‌నాలు ఉన్నాయో తెలిసిందే. చిరంజీవి నుంచి చాలా కాలంగా మిస్ అవుతోన్న కామెడీ యాంగిల్‌ను ఫుల్ ప్లెడ్జ్‌గా ఈ సినిమాతో ద‌ర్శ‌కుడు అనిల్ చూపించ‌బోతున్నాడు. ఈ సినిమా రీసెంట్‌గానే షూటింగ్ స్టార్ట్ అయ్యింది.Nayanthara Hot Photo Gallery | Nayanthara Gorgeous Saree Pictures | All ...అలా షూటింగ్ స్టార్ట్ అయ్యిందో లేదో వెంట‌నే ఫ‌స్ట్ షెడ్యూల్ కూడా ఫినిష్ చేసేశారు. ఇంత స్పీడ్ ఏంది అనిల్ అని సోష‌ల్ మీడియాలో ఒక్క‌టే ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఒక రోజు ముందుగానే అనిల్ అండ్ టీం ఫ‌స్ట్ షెడ్యూల్‌కు ప్యాక‌ప్ చెప్పేశార‌ట‌. దీనిని బ‌ట్టి అనిల్ ఎంత ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ఈ సినిమా షూట్ చేస్తున్నాడో తెలుస్తోంది. కొద్ది రోజుల గ్యాప్‌లోనే వెంట‌నే రెండో షెడ్యూల్ కి కూడా రంగం సిద్ధం చేసేశాడ‌ట‌.

దీనిని బ‌ట్టి అనిల్ రావిపూడి జెట్ రాకెట్ స్పీడ్‌తో ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేయ‌నున్నాడు. ఈ సినిమాను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వ‌చ్చే సంక్రాంతి రేసులో దింప‌నున్నారు.

Latest news