తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గద్దర్ అవార్డుల విజేతలను ప్రకటించింది. ఉత్తమ నటుడు అల్లు అర్జున్ , ఉత్తమ చిత్రం కల్కి, అలాగే ఉత్తము దరకుడు నాగ్ అశ్విన్ ఇలా చాలా రంగాలలో అవార్డులు ప్రకటించింది. విజేతలకు ఎవరికివారు వ్యక్తిగతంగాను అటు సోషల్ మీడియా వేదికగాను అభినందనలు చెబుతున్నారు. ఎవరికి ఇష్టమైన వాళ్ళు వారిని అభినందిస్తూ సోషల్ మీడియాలో మెసేజ్‌లు పెడుతున్నారు. ఇక మెగా కాంపౌండ్ హీరో అయిన బన్నీ నటించిన పుష్ప 2 సినిమాలో ఆయన నటనకు గాను ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది. మెగాస్టార్ మాత్రం గుంపులో గోవిందా అన్నట్టు మొత్తంగా విజేతలకు అభినందనలు అంటూ చిన్న మెసేజ్ తో సరిపెట్టేశారు. ప్రత్యేకంగా ఎవరి పేరు ఆయన రాసుకు రాలేదు. అందరికీ అభినందనలు అని చెప్పారు కదా అని సరిపెట్టుకునే వారు సరిపెట్టుకుంటారు.. అన్ని వేరు బెస్ట్ యాక్టర్ వేరు.. పైగా ఆ అవార్డు వచ్చింది తన సొంత బావమరిది కొడుకు.. తన ఇంటి మనిషి కూడా.. అలాంటప్పుడు ప్రత్యేకంగా అభినందించాలి.. కానీ చిరు అలా చేయలేదు.పైగా రెండు కుటుంబాలకు మధ్య కాస్త గ్యాప్ ఉందని వార్తలు ఎప్పటినుంచో వింటున్నాం.. ఇలా చేస్తే అలాంటివి మళ్లీ జనాలకు గుర్తుకొస్తాయి అన్నది మెగాస్టార్‌కు తెలియనిది కాదు.. మెగాస్టార్ తన ట్వీట్ బన్నీ అభిమానులకు నచ్చిందో లేదో తెలుసుకోవాలంటే .. ఆయన చేసిన ట్వీట్ కింద ఉన్న కామెంట్లు చూస్తే చాలు ..! ఇదే చరణ్ కు బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తే కూడా మెగాస్టార్ ఇలాగే హోల్‌సేల్‌గా ట్వీట్ వేసి అభినందించి ఊరుకుంటారా ? అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
బన్నీ పేరు పలకడం కూడా చిరంజీవికి ఇష్టం లేదా..?
